CM KCR: సీఎం కేసీఆర్‌తో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చలు..

గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో గిరిధర్ గమాంగ్‌తోపాటు ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు.

CM KCR: సీఎం కేసీఆర్‌తో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చలు..
Former Odisha Cm Giridhar Gamang Meets Cm Kcr
Follow us

|

Updated on: Jan 13, 2023 | 4:40 PM

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో గిరిధర్ గమాంగ్‌తోపాటు ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీగా మారిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కలుస్తున్నారు. బీజేపీ, ఎన్‌డీఏ యేతర శక్తులకు కూడగట్టే పనిలో ఉన్నారు. దేశంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరుకాబోతున్నారు.

గత 1999 సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ టైమ్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నాటి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చిన రాజకీయ నేత. ఆ తర్వాత 1999లో పార్టీ ఆదేశాల మేరకే వాజపేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అంతేకాకుండా ఆయన కుమారడు శిశిర్ గమాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ బీజేపీ గూటికి చేరారు.

కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా కాలం క్రియాశీల శక్తి వ్యవహరించారు. ఒడిశాలోని కోరాపుట్‌ లోక్‌సభ సభ్యుడిగా మొదటిసారి 1972లో గెలిచిన గిరిధర్‌ గమాంగ్ 2004 వరకు 9 సార్లు వరుసగా ఎంపీగా గెలుస్తూనే వచ్చారు. అయితే, 1999 ఫిబ్రవరి నుంచి పది నెలల పాటు ఒడిశాకు 13వ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటమిని చవి చూశారు. 2009 ఎన్నికలలో బిజూ జనతాదళ్‌కు చెందిన జయరామ్ పాంగి చేతిలో ఆయన మొదటిసారిగా కోరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?