Honey Trap: ఓ లింక్‌ క్లిక్… ఆపై వీడియో కాల్‌.. కట్‌ చేస్తే 2 కోట్ల 70 లక్షలు హాంఫట్‌

హనీట్రాప్‌...తేనే పూసిన కత్తి కన్నా డేంజర్‌. నడుస్తోన్న చరిత్రలో హనీట్రాప్‌ మోసాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ బిగ్‌షాట్‌ వలపు వలకు చిక్కాడు. ఒక్క వీడియో అతని జీవితాన్నే మార్చేసింది.

Honey Trap: ఓ లింక్‌ క్లిక్... ఆపై వీడియో కాల్‌.. కట్‌ చేస్తే  2 కోట్ల 70 లక్షలు హాంఫట్‌
Honey Trap
Follow us

|

Updated on: Jan 13, 2023 | 8:33 PM

అంకుల్‌..చాలా బీజీ.. పక్కా బిజినెస్‌ మ్యాన్‌ కటౌట్‌. ఎంత బిజీగావున్నా స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ కొత్తదనం కోసం వెదుకుతూనే ఉంటాడు. ఓ లింక్ వచ్చింది. వీడియో కాల్‌ వర్కవుటయింది. యురేకా అనే రేంజ్‌లో అంకుల్‌ చిప్‌ ఓ రేంజ్‌లో ఇలా థ్రిల్లు..చిల్లూ. అంతేనా….గురుడు డ్యూయట్‌ డ్రీమ్స్‌.. ఆమె తన చెంతనకు వచ్చినట్టు.. నవ్వింతలు..తుళ్లింతలతో ఇద్దరూ పార్క్‌ల్లో ..హోటల్‌లో షికార్లు చేసినట్టు … కలలో విహారించాడు. కల నిజమైనట్టు ఫోన్‌కాల్‌ రానే వచ్చింది.. హాయ్‌ అని హాస్కీ వాయిస్‌తో అంకుల్‌ గుండె జారీ గల్లంతైంది.. ముచ్చట ఎందాకో వెళ్లింది.

కట్‌ చేస్తే అంకుల్‌ బ్యాంక్‌ ఖాతా అక్షరాల 2 కోట్ల 70 లక్షల కోతకు గురైంది. సైబర్‌ క్రైమే. కానీ అంకుల్‌ ఎవరీకీ ఓటీపీ చెప్పలేదు. సీవీవీ..పాస్‌వర్డ్‌ గట్రా ఎవరీకీ ఒప్పచెప్పలేదు. మరి 30 లక్షల తక్కువ మూడు కోట్లు ఎలా గల్లంతయ్యాయి?. అవాంఛిత లింకును నొక్కాడు.. హస్కీ వాయిస్‌కు ఫ్లాటయ్యాడు.. ఆ శాల్తీ ఎవరో ఏంటో ఆరా తీయకుండా పోలోమని వీడియో కాల్‌ లో తొందరపడ్డాడు. ఆ ఫలితమే 2 కోట్ల 70 లక్షలు స్వాహా..

నో డౌట్‌..అంకుల్‌ హానీట్రాప్‌ వలలో చిక్కాడు. అమ్మాయి వాయిస్‌తో.. సరస సంభాషణతో అంకుల్‌ను ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. అతని న్యూడ్‌ వీడియోను రికార్డ్‌ చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు దండుకున్నారు. అంతటితో ఊరుకులేదు. సీఐ అంటూ ఒకసారి… సీబీఐ ఆఫీసర్‌ అంటూ మరోసారి .. ఇలా ఫోన్ల మీద ఫోన్లు చేసి అంకుల్ని బాగా పిండేశారు. అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కారణం నీవేనంటూ మరో ఫోన్‌..భయంతో భారీ మొత్తంలో డబ్బు సమర్పించుకున్నాడు గుజరాతీ బిజినెస్‌ మ్యాన్‌. ఆల్‌ టుగెదర్‌గా 2కోట్ల 70 లక్షలు నొక్కేశారు. మరి ఈ మ్యాటరంతా ఎలా బయటకు వచ్చింది. అది మరో ట్విస్ట్‌.

కేసు క్లోజ్ అంటూ ఓ లెటర్‌ పంపారు.అది ఫేక్‌ అని గుర్తించిన బాధితుడు.. అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఇంకేం అహ్మదాబాద్‌లో కూపీలాగితే రాజస్థాన్‌లో డొంక కదిలింది. అంకుల్‌కు ఫోన్‌ చేసి అమ్మాయి కాదు. ఓ కంత్రీ కుర్రాడు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌ అడ్డాగా అహ్మదాబాద్‌ బిజినెస్‌మ్యాన్‌ను ఓ ఆటాడుకున్నాడు. అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ టీమ్స్‌రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడు మాములోడు కాదు. ఫుల్‌గా వీడియో లోడ్‌ చేసి .. ట్రిపుల్‌ ఎక్స్‌ బొమ్మలను ఎంజాయ్‌ చేసే ఇట్టాంటి అంకుల్స్‌ను హానీట్రాప్‌ చేయడమే ఇలాంటి కేటుగాళ్ల పని. అనవసరమైన లింకులు. టచ్‌ చేసినా.. హాస్కీ వాయిస్‌ అని టెంప్టయినా అంకుల్‌ చిప్‌లో మోసపోవడం ఖాయం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.