AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: అమ్మాయి పెళ్లికి హాజరైన ఐదుగురు మాజీ లవర్లు.. వధువు చేసిన పనికి అంతా షాక్.. చివరకు..

వివాహం సమయంలో మాజీ ప్రియుడు (మాజీ బాయ్‌ఫ్రెండ్) వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా..? గుండెలో ఝల్లు మనిపిస్తుంది.. ఎందుకంటే.. మాజీ లవర్ వివాహంలో

Wedding: అమ్మాయి పెళ్లికి హాజరైన ఐదుగురు మాజీ లవర్లు.. వధువు చేసిన పనికి అంతా షాక్.. చివరకు..
China Wedding
Shaik Madar Saheb
|

Updated on: Jan 14, 2023 | 6:36 PM

Share

పెళ్లి అనేది పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు చనిపోయే వరకు జీవితాంతం కలిసిమెలసి ఉంటామంటూ ప్రమాణం చేస్తారు. అయితే.. వివాహం సమయంలో మాజీ ప్రియుడు (మాజీ బాయ్‌ఫ్రెండ్) వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా..? గుండెలో ఝల్లు మనిపిస్తుంది.. ఎందుకంటే.. మాజీ లవర్ వివాహంలో ప్రత్యేక్షమైతే ఆ సందర్భం ఎలా ఉంటుందో వర్ణించలేనిది. అచ్చం అలాంటి ఘటనే చైనాలో జరిగింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఒక వధువు తన పెళ్లికి తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ అందరినీ ఆహ్వానించింది. ఒక్కరో ఇద్దరో అనుకుంటున్నారా..? అలా అయితే పప్పులో కాలేసినట్లే.. మొత్తం ఐదుగురు మాజీ లవర్లను పెళ్లికి పిలిచింది. ఈ వేడుకలో వారికి ప్రత్యేక ట్రీట్‌ ఇవ్వడంతో పాటు ఆహారం కోసం ప్రత్యేక టేబుల్ కూడా ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా..? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తల ప్రకారం.. ఈ వివాహం జనవరి 8న హుబే ప్రావిన్స్‌లో జరిగింది. దీని ఫోటోలు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో షేర్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఐదుగురు అబ్బాయిలు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వీరంతా పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించిన వారని.. వధువు మాజీ బాయ్‌ఫ్రెండ్స్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మాజీ లవర్లు అంతా భావోద్వేగానికి గురైనట్లు పేర్కొంటున్నారు.

టేబుల్ మీద వారందరి ముందు నేమ్ ప్లేట్ కూడా ఉంది. దానిపై ‘మాజీ బాయ్‌ఫ్రెండ్స్’ అని కూడా రాసి ఉంది. అయితే, మాజీలంతా అలా ఎలా కూర్చున్నారు అంటూ.. వివాహ వేడుకకు వచ్చిన వారంతా తెగ చూశారని పేర్కొంటున్నారు. వారితోపాటు ఇద్దరు మహిళలు కూడా టేబుల్ వద్ద కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి
Viral News

Viral News

వైరల్ ఫోటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. మాజీ బాయ్‌ఫ్రెండ్‌లను వివాహానికి ఆహ్వానించడానికి చాలా ధైర్యం కావాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దాంపత్య జీవితాన్ని పాడు చేసే అవకాశం కూడా ఉందంటూ పేర్కొంటున్నారు. ఇలా వారిని ఆహ్వానికి వధువు ఏమి నిరూపించాలనుకుంటుంది.. వరుడు ఏం అనుకుంటాడు..? అంటూ ఓ నెటిజన్ల ప్రశ్నించాడు.

పెళ్లిలో మాజీ బాయ్‌ఫ్రెండ్‌లను పిలవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు జూన్ 2022లో, ‘X బాయ్‌ఫ్రెండ్స్’ టేబుల్‌పై 9 మంది పురుషులు కూర్చున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!