AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antibiotics: వామ్మో.. యాంటి బయాటిక్స్‌తో ఇంత ప్రమాదమా? అతిగా వాడితే ఇక అంతే! 

ఇటీవల కాలంలో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒకరకమైన పేగు సంబంధిత వ్యాధులు.

Antibiotics: వామ్మో.. యాంటి బయాటిక్స్‌తో ఇంత ప్రమాదమా? అతిగా వాడితే ఇక అంతే! 
AntibioticsImage Credit source: Pixabay
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: May 20, 2024 | 4:15 PM

Share

ఈ రోజుల్లో ఎవరికి వారే వైద్యులైపోతున్నారు.. ఏ చిన్న నలత కలిగినా వెంటనే తమ సొంత ప్రిస్క్రిప్షన్ ను అమలు చేసేస్తున్నారు. తెలిసిన మందులన్నీ మెడికల్ స్టోర్ కి వెళ్లి కొనేసి వాడేస్తున్నారు. దానిలో యాంటీ బయాటిక్స్ కూడా విరివిగా వాడుతున్నారు. అయితే వైద్యుల సిఫార్సు లేకుండా యాంటీ బయాటిక్స్ వాడటం మంచిది కాదు. ఈ విషయం తెలిసినా అంతా యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఫలితంగా చాలా రుగ్మతలు చుట్టుముడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానమైనది డ్రగ్ రెసిస్టెన్స్. దీని కారణంగా శరీరంలో ఆ డ్రగ్ కి రెసిస్టెన్స్ వచ్చేసి తర్వాత ఆ మందులు వాడినా రోగం తగ్గదు. దీంతో పాటు ఇటీవల కాలంలో మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒకరకమైన పేగు సంబంధిత వ్యాధులు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్(ఐబీడీ) రిస్క్‌ను పెంచుతుందని ఓ అధ్యయనం తేల్చింది. దీని పూర్తి సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం..

పెరుగుతున్న బాధితులు..

ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నారని.. రానున్న దశాబ్దకాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.. నేషనల్ మెడికల్ డేటా నుంచి 2000 – 2018 మధ్య గల ఐబీడీ పేషెంట్ల వివరాలు సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. దాదాపు 61 లక్షల మంది డేటా నుంచి ఈ అధ్యయనం చేశారు. వీరిలో సగం మంది మహిళలు కూడా ఉన్నారు. కనీసం ఒక్కసారైనా యాంటీబయాటిక్స్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ కాలంలో 36,017 మందిలో అల్సరేటివ్ కొలైటిస్, 16,881 మందిలో క్రాన్స్ డిసీజ్ ఉన్నట్టు సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే యాంటిబయాటిక్ వినియోగించని వారితో పోల్చితే వినియోగించిన వారిలో ఐబీడీ ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. వయస్సుతో సంబంధం లేకుండా రిస్క్ అధికంగా ఉందని అధ్యయనంలో గుర్తించారు. 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో ఐబీడీ ఉండేందుకు 28 శాతం ఎక్కువ ముప్పు ఉందని, 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో 48 శాతం ఎక్కువ ముప్పు ఉందని అధ్యయనం ద్వారా తెలిసింది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు 47 శాతం ఉందని తేల్చింది.

ఈ వయసు వారు జాగ్రత్త..

అల్సరేటివ్ కొలైటిస్ కంటే క్రాన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని.. 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతం, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 62 శతం, 60 పైబడిన వారిలో ఈ రిస్క్ 51 శాతం ఉందని అధ్యయనం స్పష్టం చేసింది. ఈ రిస్క్ క్యుములేటివ్‌గా ఉందని, అంటే యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నప్పుడల్లా ఆ రిస్క్ అదనంగా వయస్సును బట్టి 11 శాతం, 15 శాతం , 14 శాతం పెరిగిందని స్టడీ తేల్చింది.

ఇవి కూడా చదవండి

మరేం చేయాలి..

యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా కాదు. అసలు వాటిని వాడకపోవడం ఉత్తమం అట. సమస్యలు వచ్చినప్పుడు వాటిని నాచురల్గా ఎలా పరిష్కరించుకోవాలో చూడాలని హితవు పలుకుతున్నారు. యాంటిబయాటిక్స్ పరిమితం చేయడం ఐబీడీ రిస్క్ తగ్గించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..