AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తియ్యని చెరకుతో తీపి ప్రయోజనాలు ఎన్నో.. గుండె జబ్బుల సమస్యలను కూడా..

సంక్రాంతి, భోగి పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చెరకు. చెరకు తీపికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు శరీర కదలికలను నియంత్రిస్తాయి. చెరుకులో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. చెరకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ..

Ganesh Mudavath
|

Updated on: Jan 16, 2023 | 6:44 AM

Share
మనం ఇంట్లో ఉపయోగించే చక్కెర కంటే చెరకులో ఎక్కువ విటమిన్లు ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి1, రైబోఫ్లావిన్ చెరకులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు చెరకులో ఉంటాయి. ఇవి మలేరియా, చర్మ క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలకు దారితీసే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తాయి.

1 / 5
శరీరం నుంచి అదనపు ఉప్పు, నీటిని సరిగ్గా తొలగించడానికి మూత్రపిండాలు సహాయపడతాయి. చెరుకు రసాన్ని నిమ్మరసం లేదా మంచినీళ్లలో కలిపి తాగితే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. చెరకు రసం కొంతమందిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

2 / 5
Sugarcane Juice Side Effects

Sugarcane Juice Side Effects

3 / 5
గుండె జబ్బుల హెచ్చరిక.. గుండె జబ్బులు ఉన్నవారు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు చెరకును ఎక్కువగా తిన కూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, చక్కెర నుండి 8% కేలరీలు పొందిన వారి కంటే చక్కెర నుండి 20% కేలరీలు పొందిన వ్యక్తులు గుండె జబ్బులు వచ్చే అవకాశం 38% ఎక్కువ.

4 / 5
హెచ్చరిక.. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం సమస్యలు అధిక చెక్కర వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మితంగా చెరకును తింటేనే ఫలితం ఉంటుంది. ఈ పొంగల్‌ను చెరుకుతో అమృతంగా మార్చుకోండి..

5 / 5