Telugu News » Photo gallery » High BP Patients keep distance from these things health care tips in Telugu
High BP: చీటికీ మాటికీ కోపం వస్తుందా..? అయితే, ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..
Shaik Madarsaheb |
Updated on: Jan 15, 2023 | 9:45 PM
ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హైబీపీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. హైబీపీని మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
Jan 15, 2023 | 9:45 PM
High Bp
1 / 6
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2 / 6
ఆహారంతో పాటు ఊరగాయ, పచ్చళ్లను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే ఊరగాయలకు దూరంగా ఉండాలి.
3 / 6
బీపీ రోగులు మద్యం సేవించకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. దీనివల్ల బీపీ పెరుగుతుందని పేర్కొంటున్నారు.
4 / 6
చాలా మందికి తరచుగా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, హై బీపీ ఉన్నవారు టీ తాగడం మానేయాలి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల మీ బీపీ పెరుగుతుంది.