Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్‌, కొలెస్ట్రాల్‌తో పాటు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.

Health Care: పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Diabetes Symptoms
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2023 | 8:47 PM

ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. థైరాయిడ్‌, కొలెస్ట్రాల్‌తో పాటు మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం వ్యాధి గురించి మాట్లాడితే.. దీని గురించి అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ప్రమాదకర వ్యాధులకు ఇదే కారణమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనిని మొదట్లోనే గుర్తించకపోతే.. ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం రోగులకు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొంతమంది రోగులు పాదాలలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో ఇలాంటి కొన్ని లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మధుమేహం ఉంటే.. పాదాలలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాదాలలో వాపు : మధుమేహంతో బాధపడేవారి పాదాలలో వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీని వల్ల రోగులు నిటారుగా నిలబడటంతోపాటు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. మీ పాదాలలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

పాదాలలో తిమ్మిరి: మధుమేహం ప్రారంభ లక్షణం పాదాలలో తిమ్మిరి. వాస్తవానికి ఈ సమస్య ఉంటే.. శరీరంలోని బ్లడ్ షుగర్ పెరిగినట్లేనని పేర్కొంటున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతుంటే మీ పాదాలు మొద్దుబారినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా కొంతమందికి దీని వల్ల పాదాలలో నొప్పి కూడా రావచ్చు.

ఇవి కూడా చదవండి

పాదాల నొప్పి: మధుమేహం కారణంగా మీ పాదాలపై గాయాలతోపాటు నొప్పి కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, బ్యాక్టీరియా శరీరంలో వ్యాపించడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా రోగులకు ఇన్ఫెక్షన్లు, పాదాల చుట్టూ గాయాలు వస్తాయి. అంతే కాదు పాదాలపై పొక్కులు కూడా కనిపిస్తాయి.

గోళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లను ప్రభావితం చేస్తుంది. గోళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..