Health Care: ఆ సమయంలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jan 14, 2023 | 9:51 PM

మరుగుదొడ్డికి వెళ్లిన వెంటనే, లేదా వెళ్లకముందు నీరు తాగడం అనేవి శరీరంపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత..

Health Care: ఆ సమయంలో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Water

ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో.. చాలామందికి కొన్ని సందర్భాల్లో అనేక సందేహాలు తలెత్తుంటాయి. టాయిలెట్ వెళ్లే ముందు నీరు తాగాలా వద్దా..? టాయిలెట్‌కి వెళ్లొచ్చిన తర్వాత తాగొచ్చా..? అనే ప్రశ్నల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సాధారణంగా ఇలాంటి వాటిని పెద్దగా గమనించి ఉండకపోవచ్చు. కానీ ఈ విషయాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే, మరుగుదొడ్డికి వెళ్లిన వెంటనే, లేదా వెళ్లకముందు నీరు తాగడం అనేవి శరీరంపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత నీరు తాగాలా..? వద్దా..? అనే విషయంలో ఏది సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం, వైద్య శాస్త్రం ప్రకారం.. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. వాస్తవానికి, టాయిలెట్‌కు వెళ్లే ప్రక్రియ మొత్తం మీ కిడ్నీ, మూత్రాశయానికి సంబంధించినది. మరుగుదొడ్డికి వెళ్లడం అనేది శరీరం నిర్విషీకరణ చేసే ప్రక్రియ. ఈ సందర్భంలో నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల సాధారణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కిడ్నీలో స్టోన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా టాయిలెట్‌కి వెళ్లే ముందు కూడా నీరు తాగడం అంత మంచిది కాదంటున్నారు.

టాయిలెట్ తర్వాత వెంటనే నీరు తాగొచ్చా..

మరుగుదొడ్డి తర్వాత వెంటనే నీళ్లు తాగడం సరికాదు. దీని కారణంగా, మూత్రాశయం మీద అదనపు ఒత్తిడి పడుతుంది. దీంతో జీర్ణక్రియ pH కూడా క్షీణిస్తుంది. అందుకే టాయిలెట్ తర్వాత వెంటనే నీళ్లు తాగకండి.

ఇవి కూడా చదవండి

టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఎంత సమయానికి నీరు తాగాలి..?

మీరు కూడా టాయిలెట్ తర్వాత వెంటనే నీరు తాగితే, ఈ రోజు నుండి ఈ అలవాటును మానుకోవడం మంచిది. మీరు టాయిలెట్‌కి వెళ్లినప్పుడల్లా 20 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.. దీంతో కిడ్నీ, బ్లాడర్‌ మంచిగా పనిచేస్తాయి. ఇంకా శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu