Loan from employer: మీరు పనిచేసే కంపెనీ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలను గుర్తించుకోండి..

వాహనాల కొనుగోలు, గృహ నిర్మాణం, పిల్లల చదువులు, వివాహాలు, అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ఉద్యోగులు ఎక్కువగా వారు పనిచేస్తున్న కంపెనీల నుంచే కొంత మొత్తాన్ని లోన్ గా పొందే సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

Loan from employer: మీరు పనిచేసే కంపెనీ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలను గుర్తించుకోండి..
Loan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2023 | 7:30 AM

ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీ నుంచి వారి ఆర్థిక అవసరాల కోసం లోన్లు తీసుకోవడం అధికమవుతోంది. ఎందుకంటే ఈ లోన్లపై వడ్డీ భారం లేకపోవడం.. తీసుకున్న అప్పు ఆ ఉద్యోగి నెలవారీ జీతం నుంచే ఈఎంఐ రూపేణా తీరిపోతుండటంతో అందరూ దీనికి మొగ్గుచూపుతున్నారు. అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు ఆర్థిక, హెచ్ఆర్ నిపుణులు.. మీరు ఒక వేళ ఈ తరహా లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అత్యవసరాల కోసం..

వాహనాల కొనుగోలు, గృహ నిర్మాణం, పిల్లల చదువులు, వివాహాలు, అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ఉద్యోగులు ఎక్కువగా వారు పనిచేస్తున్న కంపెనీల నుంచే కొంత మొత్తాన్ని లోన్ గా పొందే సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. దీనిపై అతి తక్కువ వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండా ఉంటాయి. అయితే దీనిపై ఇచ్చే లోన్ల మొత్తాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగి శాలరీని బట్టి ఈ రుణాలుంటాయి. వారి నెలవారీ జీతానికి మూడు నుంచి ఐదు రెట్లు రుణంగా ఆయా కంపెనీలు ఇస్తాయి. ఇది ఆయా కంపెనీల నిబంధనలు బట్టి ఆధార పడి ఉంటుంది. ఉద్యోగి తీసుకున్న మొత్తాన్ని నెలవారీ ఈఎంఐల రూపంలో చెల్లించే వెసులుబాటును కంపెనీ అందిస్తుంది.

రుణం తీసుకునే ముందు ఇవి గమనించండి..

  • కంపెనీలో రుణం పొందే ముందు ఆ రుణమొత్తం తీరే వరకూ అక్కడ మీరు ఆ కంపెనీలోనే కొనసాగుతారో లేదో పరిశీలన చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రుణాన్ని తీర్చేందుకు అందరూ ఈఎంఐ పెట్టుకుంటారు. అది తీరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అది తీరే వరకూ మీరు అక్కడే కొనసాగాల్సి వస్తుంది. ఒకవేళ రుణం తీరకుండా సంస్థను వీడాల్సి వస్తే అది మీ కాండాక్ట్ ను దెబ్బతీస్తుంది.
  • లోన్ తీసుకునే ముందు ఆ సంస్థ విధించిన నిబంధనలు, విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. రీపేమెంట్ ఆప్షన్లు, నిర్ణీత కాల వ్యవధి వంటివి చూసుకోవాలి.
  • కొన్ని కంపెనీలు లోన్ విషయాన్ని ఆ ఉద్యోగికి, హెచ్ ఆర్ కు మధ్యనే ఉండేలా గోప్యత పాటిస్తాయి. ఇది ఆ ఉద్యోగికి హెచ్ ఆర్ మధ్యనే ఉండేటట్లు చూస్తాయి. దీని వల్ల సహోద్యోగుల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. వారి మధ్య భేదాలు, తారతమ్యాలకు అవకాశం ఉండదు. అది పని వాతావరణాన్ని హుందాగా ఉంచడానికి సాయపడుతుంది.

మరిన్ని అవకాశాలను పరిశీలించాలి..

ఒక కంపెనీలో మీరు ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం నుంచి పనిచేస్తూ ఉంటే మీకు మరిన్ని రుణ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిల్లో పీఎఫ్, కారుణ్య సంపద్ వంటి పథకాల నుంచి లోన్లను వినియోగించుకోవచ్చు. అలాగే ఎల్ఐసీ పాలసీ నుంచి కూడా లోన్లు పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..