Foldable e-bike: భలే ఉందే ఈ బైక్.. ఎంచక్కా మడతపెట్టి మంచం కింద సర్దేయొచ్చు.. ధర తెలిస్తే!
జపాన్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా.. ఈ బైక్ ను మడతపెట్టి సూట్ కేస్ మాదిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ల వచ్చు. ఇంతకీ ఆ కంపెనీ ఎంటి? ఆ బైక్ విశేషాలేంటి..
వినియోగదారుల ఆసక్తి, అవసరతల దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లోని ఇంజినీర్లు తమ మెదళ్లకు పదును పెడుతున్నారు. ఫలితంగా అత్యుత్తమ నాణ్యత, అత్యాధునిక సౌకర్యాలు, అందుబాటులో ఉన్న బెస్ట్ సాంకేతికతతో కూడిన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలే అధికంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో నూతన ఆవిష్కరణలకు పెట్టింది పేరైన జపాన్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా.. ఈ బైక్ ను మడతపెట్టి సూట్ కేస్ మాదిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ల వచ్చు. ఇంతకీ ఆ కంపెనీ ఎంటి? ఆ బైక్ విశేషాలేంటి.. ధర ఎంత వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం..
జపనీస్ స్టార్టప్ కంపెనీ..
జపాన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఐకోమా(Icoma) టాటామెల్(Tatamel) పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో దీనిని ప్రదర్శించింది. దీని ప్రత్యేకత ఏంటంటే కొన్నిసెకన్లలోనే సూట్‌కేస్-పరిమాణంలో చతురస్రాకారంలో దీనిని మడిచి ఎంచక్కా తీసుకెళ్లి పోవచ్చు. ఈ బైక్ ధర $4,000 (దాదాపు రూ. 3,30,862)ఉంది. అత్యంత హై-ఎండ్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ల శ్రేణిలో ఆ కంపెనీ దీనిని తీసుకొస్తోంది. వచ్చే ఏడాది చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
స్పెసిఫికేషన్లు..
ఈ బైక్ గరిష్టంగా 25 mph (40 kmph) వేగంతో ప్రయాణించగలుతుంది. గరిష్టంగా 2,000 వాట్ల అవుట్‌పుట్‌తో 600W ఇంటిగ్రేటెడ్ మోటారును కలిగి ఉంటుంది. వెనుక భాగంలో 12 amp-hour, 51-వోల్ట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది USB , (ఐచ్ఛిక) AC అవుట్‌పుట్‌తో కూడా వస్తుంది. ఇది ఫోన్, ల్యాప్‌టాప్, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జింగ్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
మీ డెస్క్ కిందకు..
టాటామెల్ ఎలక్ట్రిక్ బైక్ కు చిన్న సైజ్ అంటే 10-అంగుళాల చక్రాలు ఉంటాయి. దీనికి ఎటువంటి పెడల్‌లు ఉండవు. ఈ బైక్ ను మడతపెట్టేస్తే.. ఓ కారు వెనుక భాగంలో చక్కగా అమరిపోతుంది. లేదా మంచం కింద, మీ డెస్క్ కింద, లేదా లివింగ్ రూమ్ లో ఓ మూలన పెట్టేసుకోవచ్చు. ఈ బైక్ బరువు 110 పౌండ్లు (దాదాపు 50 కిలోలు) ఉంటుంది. విశాలమైన ప్రదేశాలతో శివారు ప్రాంతాల్లో నివసించే వారికి టాటామెల్ అంత అనుకూలం కాదు. కానీ రద్దీగా ఉండే జిల్లా కేంద్రాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయ భవన సముదాయాలు, పెద్ద క్యాంపస్‌ల చుట్టూ తిరగడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..