Auto Expo 2023: మార్కెట్‌లోకి కివే సూపర్ బైక్స్.. ఒకేసారి ఎన్ని బైక్స్ అందుబాటులోకి వచ్చాయంటే?

ముఖ బైక్ తయారీ సంస్థ కివే తన కొత్త బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కీవే ఎస్ ఆర్ 125, సిక్స్టీస్ 300ఐ, విస్టీ 300 ఈ, కె లైట్ 250 వి, కె 300 ఎన్, కె 300 ఆర్ వంటి బైక్ లు మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బైక్ మోడల్స్ మాత్రమే కాదు అందులోని వివిధ ఫీచర్లను వివరించారు.

Auto Expo 2023: మార్కెట్‌లోకి కివే సూపర్ బైక్స్.. ఒకేసారి ఎన్ని బైక్స్ అందుబాటులోకి వచ్చాయంటే?
Keyway
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2023 | 9:57 AM

ప్రస్తుతం మధ్యతరగతి, ఉన్నత తరగతి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బైక్స్ వాడడం కామన్ అయ్యిపోయింది. వినియోగదారుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రతి బైక్ తయారీ సంస్థ తన కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి దించుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023 లో తమ కొత్త బైక్స్ వివరాలను పంచుకుంటున్నాయి. ఇదే తరహాలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ కివే తన కొత్త బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కీవే ఎస్ ఆర్ 125, సిక్స్టీస్ 300ఐ, విస్టీ 300 ఈ, కె లైట్ 250 వి, కె 300 ఎన్, కె 300 ఆర్ వంటి బైక్ లు మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. బైక్ మోడల్స్ మాత్రమే కాదు అందులోని వివిధ ఫీచర్లను వివరించారు. ఈ సూపర్ బైక్స్ ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

కీవే ఎస్ఆర్ 125

ఈ మోడల్ బైక్ ను మధ్యతరగతి వినియోదారులకు అందుబాటులో ఉండేలా రూపొందించారు. రూ.1.29 లక్షలకు ఇది కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అలాగే దీని ఫీచర్స్ విషయానికి వస్తే 125 సీసీ ఎస్ ఓ హెచ్ సీ ఇంజిన్, సింగిల్ సిలిండర్, 4స్ట్రోక్ 9.7 గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ సిస్టిమ్ తో వస్తుంది. సూపర్ సస్పెన్షన్ తో పాటు వెనుక వైపు డిస్క్ బ్రేక్ తో ఇది వినియోగదారుల మనస్సును గెలుస్తోంది. 

కీవే విస్టే 300

హంగేరియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే విస్టే 300 స్కూటర్‌తో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. దేశంలో కొత్త స్కూటర్ సెగ్మెంట్‌ను తాము సృష్టించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే కీవే వెస్టీ 300 ధర రూ. 2.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో  వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

కీవే కే లైట్ 250 వీ

కీవే కే లైట్ 250 వీ చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఇది వీ ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇండియాలోనే తొలి క్వాటర్ లీటర్ క్రూయీజ్ మోటర్ సైకిల్. ఈ మోటర్ సైకిల్ 18.5 బీహెచ్ పీ పవర్ తో నడుస్తుంది. దీని ధర రూ.2.89 లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మోడల్ బైక్ ను బుక్ చేసుకోవాలంటే రూ.10000 చెల్లించాలని కంపెనీ పేర్కొంది. 

కీవే కె 300 ఎన్/ కీవే కె 300 ఆర్

కీవే 300 ఆర్ మోటర్ సైకిల్ పూర్తిగా ఫెయిర్ గా ఉంటుంది. 292 సీసీ తో వచ్చే ఈ బైక్ నడవడానికి 27 బీహెచ్ పీ పవర్ అవసరం. దీని ధర రూ.2.65 లక్షలు గా ఉంటుంది. దీన్ని బుక్ చేయాలంటే రూ. 35000 కట్టాలని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు