Doogee: గతంలో ఎన్నడూ ఇలాంటి ఫోన్‌ను చూసి ఉండరు.. స్టన్నింగ్ లుక్స్‌, అదిరిపోయే ఫీచర్స్‌.

టెక్‌ మార్కెట్లోకి మరో ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. డూగా వీ మ్యాక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ వచ్చే ఈ ఫోన్‌లో బెస్ట్‌ ఫీచర్స్‌ను అందిస్తున్నారు. చైనాకు చెందిన ఈ కంపెనీ ఫిబ్రవరిలో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో..

Doogee: గతంలో ఎన్నడూ ఇలాంటి ఫోన్‌ను చూసి ఉండరు.. స్టన్నింగ్ లుక్స్‌, అదిరిపోయే ఫీచర్స్‌.
Doogee V Max
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2023 | 11:08 AM

టెక్‌ మార్కెట్లోకి మరో ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. డూగా వీ మ్యాక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ వచ్చే ఈ ఫోన్‌లో బెస్ట్‌ ఫీచర్స్‌ను అందిస్తున్నారు. చైనాకు చెందిన ఈ కంపెనీ ఫిబ్రవరిలో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో 22,000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ భారీ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్‌ 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది. 37.3 ఎమ్‌ఎమ్‌ మందంతో ఈ ఫోన్‌ను రూపొందించారు.

రఫ్‌ లుక్స్‌తో కనిపిస్తోన్న ఈ ఫోన్‌ను బ్లాక్‌, సన్‌షైన్‌ గోల్డ్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ కెపాసిటీ ఈ స్క్రీన్‌ సొంతం. 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 616తో కూడిన 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్యాక్‌ లుక్‌ను లెధర్‌ డిజైన్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో ఫోన్‌ పై నుంచి పడినా డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటుంది.

ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 10 రోజుల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇక స్టాండ్‌ బై విషయానికొస్తే ఏకంగా 64 రోజులు వస్తుంది. గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఫోన్‌ను తయారు చేశారు. సెల్ఫీ కెమెరాకు నాచ్‌ డిస్‌ప్లేను అందించారు. ట్రిపుల్ కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్‌లో 19 జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఫోన్‌ ధర, పూర్తి ఫీచర్లపై త్వరలోనే అధికారిక ప్రకటనరానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..