Mahindra Electric Cars: టాటా నెక్సాన్‌కు పోటీగా రానున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. ఫీచర్స్, ధర వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా రిలీజ్ చేసిన ఎక్స్ యూవీ 400 మోడల్ లోని రెండు కార్లు ఈ ఏడాది నుంచే కస్టమర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఆ కార్ల ప్రైస్ రేంజ్, ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. దీని ఫీచర్లను చూస్తే వినియోగదారుల మనస్సు దోచుకోవడం గ్యారెంటీ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్ ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు పోటీగా ఎలక్ట్రిక్ కార్లు కూడా వినియోగదారుల మనస్సును గెలుస్తున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా రిలీజ్ చేసిన ఎక్స్ యూవీ 400 మోడల్ లోని రెండు కార్లు ఈ ఏడాది నుంచే కస్టమర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఆ కార్ల ప్రైస్ రేంజ్, ఫీచర్లను అధికారికంగా ప్రకటించింది. దీని ఫీచర్లను చూస్తే వినియోగదారుల మనస్సు దోచుకోవడం గ్యారెంటీ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్ యూవీ 400 మోడల్ లోని రెండు కార్లు అధునాతన ఫీచర్లపై మనమూ ఓ లుక్కేద్దాం.
ఎక్స్ యూవీ 400 ఈవీ ధర రూ.15.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకూ ఉంటుందని కంపెనీ చెబుతుంది. దీన్ని కంపెనీ ప్రాథమిక ఎలక్ట్రిక్ కార్ గా పరిగణిస్తుంది. ఎందుకంటే 2027 నాటికి కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ వే ఉండాలని కంపెనీ భావిస్తుంది. ఈ ఏడాదిలో కంపెనీ 20, 000 యూనిట్లు అమ్మాలనుకుంటుంది. ఈ కార్ కు ఈ నెల 26 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది.
ప్రారంభ మోడల్ గా పరిగణించే ఎక్స్ యూవీ 400 ఈఎల్ మార్చి 30 నుంచి డెలివరీ ప్రారంభమవుతాయి. ఎక్స్ యూవీ ఈసీ దీపావళి సీజన్ కు డెలీవరీలు ఇస్తామని చెబుతున్నారు. ఎక్స్ యూవీ ఈఎల్ 39.4 కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 456 కిలోమీటర్ల రేంజ్ లో వస్తుంది. అలాగే ఎక్స్ యూవీ ఈసీ 34.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 375 కిలోమీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఈ కార్లు కేవలం 8.3 సెకన్లలో వంద కిలోమీటర్ల రేంజ్ ను అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్ గరిష్ట వేగం గంటకు 150 కి.మీ రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..