Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: మీరు ఎన్నారైనా అని అడిగిన నెటిజన్.. తన సమాధానంతో ప్రజల హృదయాన్ని గెలుచుకున్న ఆనంద్ మహీంద్రా

ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా పోస్ట్‌లలో ఒకటి చర్చావేదికగా మారింది. ఆ పోస్టు.. దానికి ఆనంద్ మహీంద్రా చెప్పిన సమాధానం చూస్తే ఎవరి హృదమైనా సంతోషంతో పొంగిపోతుంది. ఆయన ఇచ్చిన సమాధానంతో ప్రతి భారతీయుడు తప్పకుండా సంతోషిస్తాడు

Anand Mahindra: మీరు ఎన్నారైనా అని అడిగిన నెటిజన్.. తన సమాధానంతో ప్రజల హృదయాన్ని గెలుచుకున్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2022 | 12:18 PM

Anand Mahindra: మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తన వ్యాపార సామ్రాజ్యంతో పాటు.. తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో స్పందిస్తూ.. ప్రజలకు మరింత చేరువయ్యారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన మనసు మెచ్చిన వివిధ రకాల చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తారు. కొన్నిసార్లు తమాషా పోస్ట్‌లతో ప్రజలను నవ్విస్తారు.. మరి కొన్నిసార్లు భావోద్వేగ పోస్ట్‌లతో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తారు. అదే సమయంలో.. ప్రతిభ ఉండి.. అవకాశం లేనివారికి తాను అండగా నిలబడతారు.. సహాయం చేస్తానని వాగ్దానం చేయడమే కాదు.. వారికీ వెంటనే తగినంత సాయం కూడా అందిస్తారు. అయితే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా పోస్ట్‌లలో ఒకటి చర్చావేదికగా మారింది. ఆ పోస్టు.. దానికి ఆనంద్ మహీంద్రా చెప్పిన సమాధానం చూస్తే ఎవరి హృదమైనా సంతోషంతో పొంగిపోతుంది.

ఆనంద్ మహీంద్రాను .. ఒక నెటిజన్ ట్విట్టర్‌ వేదికగా మీరు ఎన్నారై కదా?. అయితే .ప్రశ్నించాడు. దీంతో ఆ  వినియోగదారుడి ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా చాలా అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. న్యూయార్క్‌ని కుటుంబంతో సందర్శించాను. కాబట్టి నేను HRI. హృదయం (ఎల్లప్పుడూ) భారతదేశంలో నివసిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా ఇటీవల తన కుటుంబంతో న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌కి వెళ్లారు. అక్కడ కొన్ని అందమైన చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అదే పోస్ట్‌కి ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘మీరు ఎన్‌ఆర్‌ఐనా ? అని అడిగారు.. దానికి ఆనంద్ చాలా అందంగా సమాధానం ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం చదివిన తర్వాత.. ప్రతి భారతీయుడు తప్పకుండా సంతోషిస్తాడు. ఎన్‌ఆర్‌ఐ గురించి వినియోగదారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నేను కుటుంబంతో కలిసి గడపడానికి న్యూయార్క్ వచ్చాను. కానీ నేను హృదయపూర్వకంగా భారతీయుడిని’ అని చెప్పారు.

అదే సమయంలో.. ఇతరులు కూడా ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై వివిధ రకాల కామెంట్స్ చేశారు.  కొందరు  ‘గ్రేట్ రిప్లై’ అని పేర్కొన్నారు.  ‘నేను కూడా హృదయపూర్వకంగా హిందుస్తానీనే’ అని కొందరు అంటున్నారు. అదే సమయంలో..సార్, మీరు మాలాగే ఉన్నారు?  మీరు సమయం గడపడానికి ఉదయం ట్విట్టర్‌లోకి వస్తారని ఒక వినియోగదారు చాలా ఫన్నీగా కామెంట్ చేసాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..