Viral News: తనను స్టూడెంట్స్ GOAT అని పిలుస్తారని బాధపడిన లెక్కల టీచర్.. అసలు అర్ధం తెలుసుకుని కన్నీరు పెట్టుకున్న వైనం..
8వ తరగతికి చెందిన ఒక గణిత ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు GOAT లేదా మేక అని పిలుస్తారని తెలుసుకున్నారు. దీంతో చాలా రోజులుగా ఆమె చాలా కంగారు పడ్డారు. తనను విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని భావించి..చాలా మదన పడ్డారు.
Viral News: గణితం అంటే చాలా భయపడే విద్యార్థులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మ్యాథ్స్ అంటే చాలు.. ఆ లెక్కల్లో చిక్కులు మా కొద్దు అంటూ.. మ్యాథ్స్ ను దెయ్యం చూసినట్లు భయపడతారు స్టూడెంట్స్. కొందరు జోక్‌గా తీసుకుంటారు. మొత్తానికి ఎక్కువమంది మ్యాథ్స్ చేసేసమయంలో పడాల్సిన టెన్షన్ నచ్చదనేది వాస్తవం. దీంతో గణితం అంటే పీడకలలా భావిస్తారు. గణిత ఉపాధ్యాయుడు తన పాఠశాల జీవితంలో విద్యార్థుల నుండి చాలా ప్రేమను పొందడం చాలా అరుదుగా కనిపించడానికి కారణం ఇదే . ప్రస్తుతం.. ఒక లెక్కల మాస్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు తనను తాను GOAT అని పిలవడంతో టీచర్ చాలా రోజులు గందరగోళానికి గురయ్యారు. అయితే అసలు కారణం తెలియగానే స్టూడెంట్స్ అభిమానానికి కళ్లలో నీళ్లు తిరిగాయి.
8వ తరగతికి చెందిన ఒక గణిత ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు GOAT లేదా మేక అని పిలుస్తారని తెలుసుకున్నారు. దీంతో చాలా రోజులుగా ఆమె చాలా కంగారు పడ్డారు. తనను విద్యార్థులు ఎగతాళి చేస్తున్నారని భావించి..చాలా మదన పడ్డారు. టీజర్ సోషల్ మీడియా వేదికపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. విద్యార్థులు తనను GOAT అని ఎందుకు అంటారో తెలియడం లేదని.. సహాయం కోసం Reddit వినియోగదారులను కోరారు. రెడ్డిట్‌లో ఆ టీచర్ .. విద్యార్థులు నన్ను మేక అని ఎందుకు పిలుస్తారు? అని ఓ పోస్ట్ పెట్టారు.. టీచర్ ప్రశ్న పై జనాలు స్పందిస్తూ.. GOAT పదానికి పూర్తి అర్థం చెప్పారు. దీంతో ఆ టీచర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఐతే ఈ పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం అంటూ గురువుగారు ఉద్వేగానికి లోనయ్యారు.
గురువుగారు రాసిన పోస్ట్:
‘నన్ను మేక అని ఎందుకు అంటారు?’
భావోద్వేగానికి గురైన టీచర్:
లెక్కల టీచర్ GOAT అనే సంక్షిప్త పదం అవమానకరమైనది కాదు.. GOAT అంటే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అని అర్థం అని వినియోగదారులు చెప్పారు. దీంతో టీచర్ కు చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ పోస్ట్ రెడ్డిట్‌లో 3 రోజుల క్రితం నో స్టుపిడ్ క్వశ్చన్స్ ఫోరమ్‌లో షేర్ చేయబడింది. పిల్లలు తనను మేక అని ఎందుకు పిలిచారో ఇప్పుడు మహిళ ఉపాధ్యాయురాలికి స్పష్టంగా తెలియడంతో.. ఆమె క్యాప్షన్‌ను ఎడిట్ చేసి ఇలా రాశారు.. ‘GOAT పదం అర్థం తెలుసుకున్న తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. పిల్లలు నన్ను ఇంతగా మెచ్చుకుంటున్నారని, అభిమానిస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు.
స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారంటున్న నెటిజన్లు: రెడ్డిట్‌లో పోస్ట్ షేర్ చేయబడినప్పటి నుండి.. ఇప్పటివరకు 41 వేల మందికి పైగా ఈ పోస్టును లైక్ చేశారు. 1800 కంటే ఎక్కువ మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. మీ స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం అని ఒక వినియోగదారు చెప్పారు
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..