Viral Video: నా జోలికి వస్తే మటాషే.. కోడిపిల్లకు చుక్కలు చూపించిన కుక్క.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
తాజాగా ఓ కోడి పిల్లకు కుక్క అరక్షణంలో చుక్కలు చూపించింది. చావు భయం అంటే ఎంటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో కేవలం కుక్క పిల్లలు మాత్రమే కాదు.. పక్షులు, పిల్లులను కూడా ఇష్టంతో పెంచుకుంటున్నారు. పిల్లి, కుక్క, వివిధ రకాల పక్షలను ఒకే ఇంట్లో పెంచుకోవడం వలన వాటి మధ్య స్నేహం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వాటి మధ్య చిన్న చిన్న అల్లరి గొడవలు సైతం జరుగుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ కోడి పిల్లకు కుక్క అరక్షణంలో చుక్కలు చూపించింది. చావు భయం అంటే ఎంటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో.. ఒక కారులో వెనక కూర్చున్న కుక్క ముందు సీటు పైకీ తలవాల్చి తన యాజమాని వైపు ఆసక్తిగా చూస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న చిన్న కోడి పిల్ల మెల్లగా కుక్క పిల్ల వద్దకు వచ్చింది. దాని ముఖం వద్దకు వచ్చేసరికి ఆ కుక్క అమాంతం కోడిపిల్ల తలను నోట కరుచుకుంది. కాసేపటి వరకు కోడిపిల్ల తలను నోటిలో పట్టేసుకుంది. దీంతో బయటకు వచ్చేందుకు ఆ కోడిపిల్ల తెగ ప్రయత్నించింది. చివరకు ఆ కుక్క వదిలిపెట్టడంతో దేవుడా అంటూ ఊపిరిపిల్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.