Viral Video: మూడు పులి పిల్లలకు పాలుపడుతున్న ఒరెంగుటాన్‌.. అమ్మప్రేమకు కరిగిపోతున్న నెటిజన్లు.. వైరలవుతున్న వీడియో

మాటలు రాకపోయినా, మౌఖిక సంభాషణ లేకపోయినా జంతువులు కరుణామయమైన జీవులు. ఒకరికొకరు దయ, దాతృత్వం చూపే సందర్భాలను సోషల్ మీడియా ద్వారా చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు ఓ మగ ఒరంగుటాన్ 3 పులి పిల్లలను

Viral Video: మూడు పులి పిల్లలకు పాలుపడుతున్న ఒరెంగుటాన్‌.. అమ్మప్రేమకు కరిగిపోతున్న నెటిజన్లు.. వైరలవుతున్న వీడియో
Orangutan
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 9:37 PM

మాటలు రాకపోయినా, మౌఖిక సంభాషణ లేకపోయినా జంతువులు కరుణామయమైన జీవులు. ఒకరికొకరు దయ, దాతృత్వం చూపే సందర్భాలను సోషల్ మీడియా ద్వారా చాలానే చూసి ఉంటారు. ఇప్పుడు ఓ మగ ఒరంగుటాన్ 3 పులి పిల్లలను ప్రేమగా సాకుతూ, ఆడిస్తున్న అందమైన వీడియో ఇంటర్నెట్‌లో తెరపైకి వచ్చింది. ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది.

వైరల్ వీడియోలో చూసినట్లుగా ఒరంగుటాన్ పులి పిల్లలకు సంతోషంగా బాటిల్‌తో పాలు పడుతుంది. మూడు పులిపిల్ల‌ల‌తో సరదాగా ఆడుకుంటూ క‌నిపిస్తుంది. పులి పిల్లలతో ఆడుకోవడం,వాటిని ప్రేమతో చూసుకోవడం వంటివి వీడియోలో చూడవచ్చు. ఈ అందమైన వీడియోను డాక్ట‌ర్ సామ్రాట్ గౌడ ఐఎఫ్ఎస్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ సఫారీలో చిత్రీక‌రించారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను భావోద్వేగానికి గురి చేసింది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ల‌క్ష‌కు మందికిపైగా లైక్ చేయ‌డం విశేషం.

ఇవి కూడా చదవండి

దయ, కరుణతో కూడిన ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుందని, మనుషుల కంటే జంతువులే గొప్పవని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేశారు. “అమ్మ ప్రేమ షరతులు లేనిది స్వచ్ఛమైనది అంటూ మరోక నెటిజన్‌ కామెంట్ చేశారు. ఇది అద్భుతంగా ఉందంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశారు.