Ponnaganti Kura : పొన్నగంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా మగవారిలో..
ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఈ మొక్క పువ్వులు తెల్లగా చిన్నగా ముద్దగా ఉంటాయి. కాయలు పలుచగా ఉంటాయి. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం..
Ponnaganti Kura : మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో పొన్నగంటి కూరమొక్క కూడా ఒకటి. ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది (Alternanthera sessilis) అమరాంథేసి జాతికి చెందిన ఒక ఆకుకూర. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు ఆకు పచ్చ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, సన్నగా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్లగా చిన్నగా ముద్దగా ఉంటాయి. కాయలు పలుచగా ఉంటాయి. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు.పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. ఇక ఈ ఆకుకూరల లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..అవేంటో తెలుసుకుందాం…
పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ లతోపాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే చాలా మంచిది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.
పొన్నగంటి కూర జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధంలో ఒంట్లోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అధిక శరీర వేడి, తలనొప్పి తగ్గించటానికి ఈ థైలాన్ని ఉపయోగిస్తారని తెలుస్తుంది. వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది. పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ సమృద్ధిగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి