Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Running: మెరుపువేగంతో ఆటోను వెంబడించిన కుక్క.. 5కిలోమీటర్ల దూరంలో పట్టేసింది.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..!

కుక్కలు తమ యజమానిని అస్సలు విడిచిపెట్టి ఉండవు. ఆ ఇంట్లోని వారందరితోనే కలిసిపోయి ఆత్మీయంగా తిరుగుతుంటాయి. ఇంట్లో ఏ ఒక్కరూ కనిపించకపోయినా అవి బాధపడుతుంటాయి. ప్రతి నిముషం ఇంట్లోని సభ్యులంతా తనకు అందుబాటులోనే ఉండాలని కోరుకుంటుంది.

Dog Running: మెరుపువేగంతో ఆటోను వెంబడించిన కుక్క.. 5కిలోమీటర్ల దూరంలో పట్టేసింది.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..!
Dog Running
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 5:32 PM

విశ్వాసం, విధేయతకు నిదర్శనంగా కుక్కలని చెబుతారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు కుక్కలనే ఎక్కువగా పెంచుకుంటారు. అవనీ అనేక సందర్భాల్లో చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అంతేకాదు, అవి తమ యజమానిని అస్సలు విడిచిపెట్టి ఉండవు. ఆ ఇంట్లోని వారందరితోనే కలిసిపోయి ఆత్మీయంగా తిరుగుతుంటాయి. ఇంట్లో ఏ ఒక్కరూ కనిపించకపోయినా అవి బాధపడుతుంటాయి. ప్రతి నిముషం ఇంట్లోని సభ్యులంతా తనకు అందుబాటులోనే ఉండాలని కోరుకుంటుంది. ఎక్కడికి వెళ్లిన తోక ఊపుకుంటూ అక్కడికి వెళ్తుంటాయి. పొరపాటున తమ ఓనర్ ఊరికి వెళ్తే అన్నం ముట్టుకోవు. ఇతరులను తమ ఇంట్లోకి రానివ్వవు. పెంపుడు కుక్కలు కాకపోయినప్పటికీ వీధి కుక్కలకు సైతం ఒక పూట అన్నం పెడితే చాలు.. ఇక అవి బతికున్నంత కాలం ఆ ఇంటివారి పట్ల విధేయతను చూపుతుంటాయి. తాజాగా, అలాంటిదే ఓ వీధి కుక్కకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో (Social media) హల్ చల్ చేస్తుంది.

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కుక్క రిక్షాను వెంబడిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఆ రిక్షాలో ఓ ఫ్యామిలీ మెంబర్స్‌ పిల్లలు సహా ఇంటిల్లిపాది వెళ్తున్నారు. అయితే, వారు వెళ్తున్నది బయట షాపింగ్‌, పర్యాటకానికో కాదు. ఇంతకాలం వారు నివసించిన ఇంటిని విడిచిపెట్టి మరో ఇంటికి మకాం మారుస్తున్నారు. ఇన్ని రోజులుగా వారు ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి మరో ఇంట్లోకి షిఫ్ట్‌ అవుతున్నారు. వస్తువులన్నీ ప్యాక్‌ చేసుకుని తరలించారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆటోలో కొత్త ఇంటికి బయల్దేరారు. కానీ, ఇన్నీ రోజులు తమ ఇంటి ముందే ఉంటున్న వీధి కుక్కను వారు అక్కడే విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ఆ కుక్క వారిని వెంబడించింది. ఆ ఇంట్లోని వారంతా తనను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని ఆ శునకం అర్థం చేసుకుంది. ఆ ఇంటి వారితోనే ఉండాలని భావించి వారు ప్రయాణిస్తున్న ఆటో వెంటే వేగంగా పరిగెత్తింది. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి నుంచి సుమారు 5కిలోమీటర్ల దూరంలో వారు తీసుకున్న కొత్త అద్దె ఇంటికి చేరింది. అక్కడ వారిని చూసి హమ్మయ్యా అనుకుంది..ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుండి విశేష స్పందన వస్తోంది. చాలా మంది నెటిజన్లు భావోద్వేగమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి