Viral Video: పిల్లలతో రోడ్డు దాటుతున్న బాతు.. సాయం చేసిన పోలీసులు.. వీడియో చూస్తే మీరు కూడా సెల్యూట్ చేస్తారు!
అడవి జంతువులకు సహాయం చేస్తూ.. అవి పడుతున్న కష్టం చూసి కొంత ఊరట కలిగించే దిశగా ప్రయత్నించే అనేక మంది వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ తల్లిబాతు దాని గంపెడు పిల్లలతో..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా ఉంటాయి. వాటిలో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని భయందోళనకు గురిచేసే విధంగా ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. అయితే, అడవి జంతువులకు సహాయం చేస్తూ.. అవి పడుతున్న కష్టం చూసి కొంత ఊరట కలిగించే దిశగా ప్రయత్నించే అనేక మంది వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ తల్లిబాతు దాని గంపెడు పిల్లలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. పోలీసు ఉద్యోగి దానికి సాయం చేస్తాడు..దాంతో సరదు ఆఫీసర్ చేసిన పనితో ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో పారిస్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లిప్పింగ్‌లో బాతు దాని నాలుగు పిల్లలను చూడొచ్చు..అవన్నీ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది. బాతులకు సహాయం చేయడానికి ఒక పోలీసు ఆఫీసర్ ముందుకు వచ్చాడు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాలను ఆపి, ఆ అమాయక బాతులను రోడ్డు దాటించి అవతలి వైపుకు తీసుకువెళతాడు. ఇదంతా చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. చిన్నబాతు పిల్లల కోసం పోలీస్ అధికారి చేసిన సాయానికి అంతా విస్తూ పోయారు. అతడిని ఎంతగానో ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపిస్తోంది. నేటి కాలంలో ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చే ఇలాంటి వ్యక్తులు అవసరమని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.
Meanwhile in Paris.. ?
? IG: licsu pic.twitter.com/xWRIfKwkXN
— Buitengebieden (@buitengebieden) June 26, 2022
21 సెకన్ల నిడివి గల ఈ వీడియో అందమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఇది 17 వేలకు పైగా రీట్వీట్లతో షేర్ చేయబడింది. అంతేకాదు ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఇలాంటి వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకోవటం మాత్రమే కాదు.. తమకంటే చిన్నవారు, బలహీనులకు సహాయం చేయాలని ప్రజలను ప్రేరేపిస్తాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వైరల్ వీడియో తప్పక చూడండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి