Bear Attack: అనంతలో ఎలుగుబంట్ల సంచారం.. మహిళపై దాడి.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గ్రామాల్లో టెన్షన్ టెన్షన్..
ఎర్రబండలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. గ్రామంలోని ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఎలుగుబంటి దాడి చేయగా.. తీవ్రగాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడి నుంచి మరో మహిళ తప్పించుకుని..
Bear tension in Anantapur: అడవిలో ఉండాల్సిన జంతువులు బయటకు వస్తున్నాయి. గ్రామాల్లో సంచరిస్తున్నాయి జానావాస్లలో సంచరిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడికి తీవ్ర గాయాల పాలైన గ్రామస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ వారు కొలుకోనేలేదు. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో సంచరిస్తూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. అటవీశాఖాధికారులు త్వరగా స్పందించి ఎలుగుబంట్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇటీవల ఎలుగుబంటుల సంచారం అధికమైంది. ఇటీవలే కళ్యాణదుర్గం మండలం దురదగుంట గ్రామ శివారులో ఓ ఎలుగుబంటిని గ్రామస్థులు కొండ ప్రాంతంలోకి తరిమివేశారు. కానీ తాజాగా కంబదూరు మండలం ఎర్రబండలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. గ్రామంలోని ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపుతోంది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఎలుగుబంటి దాడి చేయగా.. తీవ్రగాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడి నుంచి మరో మహిళ తప్పించుకుని బయటపడింది. గాయపడిన బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళా వివరాల మేరకు కేసు నమోదు చేశారు.
ఎలుగుబంటి దాడితో గ్రామంలో భయాందోళన నెలకొంది. కళ్యాణదుర్గం మండలంలో ఐదు ఎలుగుబంట్లు సంచిరిస్తున్నట్టుగా తెలిసింది. ఇటీవల రోషన్ వలికొండ – ముదిగల్లు గ్రామాల మధ్య పంట పొలాల్లో వాటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి