Nara Lokesh: ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నారు.. బాదుడే బాదుడంటూ నారా లోకేష్ ధ్వజం

రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం 500 కోట్ల రుపాయలను పేదల నుండి కొట్టేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు లోకేష్.

Nara Lokesh: ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నారు.. బాదుడే బాదుడంటూ నారా లోకేష్ ధ్వజం
Nara Lokesh
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2022 | 12:31 PM

Nara Lokesh on RTC: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ సీఎం జగన్ పై మళ్ళీ సంచలన కామెంట్స్ చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి.. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. ఇలా ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం.. సామాన్యుడిపై పెను భారం మోపడమే అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం 500 కోట్ల రుపాయలను పేదల నుండి కొట్టేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా చార్జీలు పెంచడం దారుణం అన్నారు.

ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ లోకేష్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని..  ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని వైసీపీ ప్రభుత్వం చార్జీలు పెంచుతూ.. ప్రజలకి దూరం చేస్తుందంటూ వాపోయారు లోకేష్.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..