AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ విధానం మరో ఏడాది పొడిగింపు

ఏపీలో అమరావతి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి ఐదు పని దినాల విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.

Andhra Pradesh: అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ విధానం మరో ఏడాది పొడిగింపు
AP Government
Ram Naramaneni
|

Updated on: Jul 01, 2022 | 12:10 PM

Share

Amaravathi: అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని(AP Capital) అమరావతి ప్రాంతంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు ప్రజంట్ 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతోపాటు, కార్పోరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే డ్యూటీలు చేస్తున్నారు. ఈ విధానాన్నే మరో ఏడాది పొడిగించింది ప్రభుత్వం. సీఎస్‌ సమీర్‌శర్మ(AP chief secretary Sameer Sharma)గురువారం ఈ ఉత్తర్వులిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేయాలన్న సర్కార్.. జూన్‌ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఉచిత వసతి మరో 2 నెలలు పొడిగింపు…

హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని మరో 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత జులై ఫస్ట్‌ లోపు ఫ్లాట్లను వదిలి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉన్నఫలంగా ఆదేశాలు రావడంతో అమరావతిలోని ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి మేరకు ఉచిత వసతి సదుపాయాన్ని రెండు నెలలపాటు పొడిగించింది. కాకపోతే ఆ నివాసాలను మంచి స్థితిలోనే అప్పగించాలని.. ఆయా ఫ్లాట్ల‌కు ఏదైనా న‌ష్టం జ‌రిగి ఉంటే దానికి ఉద్యోగులే బాధ్య‌త వ‌హించాలని కూడా ప్రభుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!