Minor girl’s: దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసి పారిపోయిన దుండగులు

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు కనిపించటం లేదు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్‌ బాలికపై దాడిని అడ్డుకున్నందుకు

Minor girl's: దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసి పారిపోయిన దుండగులు
Gangrape
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 7:20 PM

మైనర్‌ బాలికలు, మహిళలపట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ప్రతినిమిషానికి ఎక్కడో ఒక చోట దారుణం జరుగుతూనే ఉంది.. కొన్ని వెలుగులోకి రాగా, అనేకం చీకట్లోనే కలిసిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు కనిపించటం లేదు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్‌ బాలికపై దాడిని అడ్డుకున్నందుకు దుండగులు బాలిక ముక్కు కోసేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాన్పూర్‌కు చెందిన ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి వారు చొరబడ్డారు. ఆ బాలికను నిర్మూనుష్య ప్రాంతానికి లాక్కెల్లి సామూహిక లైంగిక దాడికి యత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న కత్తితో ఆమె ముక్కు కోసేసి పారిపోయారు. కాగా, తీవ్ర రక్తస్రావమైన ఆ బాలికను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచనతో ఆమెను కాన్పూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

రక్తం బాగా పోవడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయలేదని, నిందితులను అరెస్ట్‌ చేయలేదని బాలిక తండ్రి ఆరోపించాడు. మొదట ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని అన్నాడు. అయితే నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కుమార్తె భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. తన కుమార్తెకు ప్రాణ భయం ఉందని, నిందితులను తగిన శిక్షవిధించాలని ఆయన డిమాండ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి