Hair Care Tips: జుట్టు సమస్యలా… కేశ సౌందర్యం కోసం ఇది మ్యాజిక్‌లా పనిచేస్తుంది..
ముఖ్యంగా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలలో ఒకటైన చుండ్రు చాలా మొండిగా మారి వేధిస్తుంటుంది. తలలో దురద, తెల్లగా పొట్టులాగా లేవడం అది కాస్తా మంటగా మారి ఇబ్బంది పెట్టడం వర్షాకాలంలో తరచూ చూస్తుంటాం..దీంతో
వర్షాకాలం అంటేనే అంటువ్యాధుల భయం పట్టుకుంటుంది అందరికీ.. ముఖ్యంగా వర్షంలో తడవడం, ఈ సీజన్ లో చల్లని వాతావరణాన్ని అనుభూతి చెందడం అందరికీ ఇష్టమే. అయితే వానలో తడవడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. తల ఆరకపోవడం దురద పుట్టడం వంటివి కూడా అంతే చికాకును తెప్పిస్తుంది. వ్యాధుల సంగతి సరేసరి..వాటితో పాటు కొన్ని ఇబ్బందుల్నీ తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలలో ఒకటైన చుండ్రు చాలా మొండిగా మారి వేధిస్తుంటుంది. తలలో దురద, తెల్లగా పొట్టులాగా లేవడం అది కాస్తా మంటగా మారి ఇబ్బంది పెట్టడం వర్షాకాలంలో తరచూ చూస్తుంటాం..దీంతో జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు డల్ గా మారిపోవడం. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సమస్యలు ఒకదాని వెనుక మరొకటి తరచుగా వస్తూ ఉంటాయి. అయితే, ఈ చుండ్రు నివారణకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చుండ్రు సమస్యకు కెమికల్స్ వాడటం కంటే మన ఇంట్లో ఉపయోగించే పదార్థాలతోనే తగ్గించవచ్చు. మన రోజువారి ఆహారంలో విరివిగా వాడే అల్లం కఫాన్ని తగ్గించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు శరీరానికి రోగనిరోధకశక్తిని పెంచేలా చేస్తాయి. ఇది మాత్రమే కాకుండా అల్లం చర్మ సంరక్షణలోనూ బాగా పనిచేస్తుంది. ఎంతో సహజసిద్ధమైన పద్దతిలో చుండ్రు సమస్యకు అల్లాన్ని అయిదు రకాలుగా ఉపయోగించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం రసంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ గుణాలు జుట్టుకు మేలు చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. ఈ రసంలో కాటన్ బాల్ ను ముంచి నేరుగా చుండ్రు ప్రభావిత ప్రాంతంలో సున్నితంగా అప్లై చెయ్యాలి. ఇది కేవలం చుండ్రును తొలగించడానికి మాత్రమే కాకుండా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఫలితంగా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
చుండ్రు అధికంగా ఉంటే అల్లం రసాన్ని నిమ్మరసంతో కలిపి ఉపయోగించవచ్చు. అలాగే, సల్పేట్ లేని షాంపూ తీసుకుని దానికి దంచి తీసిన అల్లం రసాన్ని కలపాలి. ఈ మిశ్రమంతో తల స్నానం చేస్తే కేవలం చుండ్రు తగ్గిపోవడం మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. అలాగే, అల్లం బేస్డ్ ఆయిల్స్ కూడా చుండ్రు సమస్యకు చెక్ పెట్టేందుకు సూపర్ గా పనిచేస్తాయి. అల్లం రసం కలిపి తయారు చేసిన నూనె వాడొచ్చు. ఇవి తాత్కాలికంగా కాకుండా ఎక్కువ రోజులు చుండ్రు బారినపడకుండా ఉంచుతాయి. హెయిర్ వాష్ కి యాపిల్ సైడర్ వెనిగర్, బియ్యం నీళ్లు వంటి వాటిలోకి అల్లం రసాన్ని కలిపితే ఇంకా ఎక్కువ ప్రభావంగా పనిచేస్తుంది. అలాగే, చుండ్రు సమస్యను దూరం చేసుకోవడానికి వాడే హెయిర్ ప్యాక్‌లలో కూడా అల్లం రసాన్ని కలిపి పెట్టుకుంటే ఎంతో బాధించే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి