AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో నాన్ వెజ్ తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే..

Health Tips: వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కావడం కొంచెం కష్టమవుతుంది. వర్షంలో తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మంచిది.

వర్షాకాలంలో నాన్ వెజ్ తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే..
Non Veg
Venkata Chari
|

Updated on: Jul 01, 2022 | 9:24 PM

Share

ప్రస్తుతం వర్షాకాల ప్రభావంతో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. వర్షాల తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వాతావరణాన్ని ఆస్వాదించాలంటే.. ఎవరికి తోచినట్లు వాళ్లు ప్లాన్ చేస్తూ.. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొందరు తమకు ఇష్టమైన ఆహారం తింటే.. మరికొందరు వాన చినుకుల్లో తడుస్తూ బైక్‌పై లాంగ్‌డ్రైవ్‌కు వెళ్తారు. అయితే ఈ వాతావరణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వర్షంలో ఆహారం, పానీయాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిపాటి అజాగ్రత్త అనారోగ్యానికి గురి చేస్తుంది. వర్షంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో నాన్ వెజ్ తినడం మానాలి. మాంసాహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతే కాకుండా ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల చాలా త్వరగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

వర్షంలో నాన్ వెజ్ ఎందుకు తినకూడదంటే?

వర్షాకాలంలో నాన్ వెజ్ తినకూడదు. ఇందుకు మతపరమైన కారణం కూడా ఉంది. ఈ నెలలో పూజలు, ఉపవాసాలు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మాంసాహారం తినడానికి దూరంగా ఉంటారు. ఇప్పుడు దీని వెనుక ఉన్న శాస్త్రీయ విధానం గురించి మాట్లాడుకుందాం. ఇందులో నాన్ వెజ్ ఫుడ్ ఆలస్యంగా జీర్ణమయ్యే, అధిక ప్రోటీన్ ఆహారంగా పరిగణిస్తుంటారు. వర్షంలో బలహీనమైన జీర్ణవ్యవస్థ కారణంగా, నాన్ వెజ్ ఆలస్యంగా జీర్ణమై గ్యాస్, వేడి, అజీర్ణం, కడుపులో ఇతర సమస్యలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

వర్షంలో నాన్ వెజ్ తినడం ఎందుకు ప్రమాదకరం..

  1. ఫంగస్ వచ్చే ప్రమాదం- వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా నాన్ వెజ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
  2. బలహీనమైన జీర్ణక్రియ- వర్షంలో జీర్ణ ప్రభావం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాన్‌వెజ్‌ ఫుడ్‌ జీర్ణం కావడం కష్టమవుతుంది. ఆలస్యంగా జీర్ణం కావడం కారణంగా, ఆహారం పేగులలో కుళ్లిపోతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  3. జంతువులు అనారోగ్యానికి గురవుతాయి- వర్షాలకు క్రిములు పెరుగుతాయి. జంతువులు కూడా అనారోగ్యానికి గురవుతాయి. ఈ సీజన్‌లో జంతువులలో అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. వాటి కారణంగా నాన్-వెజ్ తినడం వల్ల మీకు కూడా హాని కలుగుతుంది.
  4. చేపలు కలుషితమవుతాయి- వర్షం నీటితో పాటు మురికి చెరువులోకి, తరువాత నదులలోకి ప్రవహిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, చేపలు కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ సీజన్‌లో చేపలు తినడం కూడా మానాలి. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.