Maruti Brezza: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో విడుదలైన కొత్త మారుతి బ్రెజ్జా.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
మారుతి సుజుకి ఇండియా సరికొత్త బ్రెజ్జాను గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కొత్త బ్రెజ్జాలో ఉన్న ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ సంవత్సరం ఎక్కువగా ఎదురుచూస్తున్న మారుతి కొత్త బ్రెజ్జా (మారుతి బ్రెజ్జా 2022 లాంచ్)ఎట్టకేలకు విడుదలైంది. ఈ కాంపాక్ట్ SUVలో ఈసారి చాలా కొత్త ఫీచర్లు అందించారు. మరీ ముఖ్యంగా సన్‌రూఫ్‌తో వస్తున్న మారుతి మొదటి కారు ఇదే కావడం విశేషం. కంపెనీ కొత్త బ్రెజ్జాలో బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందించింది. ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు, ధర లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో..
మారుతి ఈ కారు పేరు నుంచి విటారా అనే పదాన్ని తొలగించింది. ఇకపై ఈ కారు బ్రెజ్జా అనే పేరుతోనే పిలవనున్నారు. మారుతి 2016లో తొలిసారిగా ఈ కారును లాంచ్ చేసినప్పుడు, ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే వచ్చింది. తర్వాత కంపెనీ పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేసింది. కొత్త బ్రెజ్జా పెట్రోల్ మోడల్‌లో వస్తుంది. మారుతి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.
పవర్‌లో తిరుగులేదు..
కొత్త బ్రెజ్జా 1.5 లీటర్ డ్యూయల్ జెట్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌ను కంపెనీ తన కొత్త ఎర్టిగా, XL6లో ఇటీవలే అందించింది. ఇది 101 bhp గరిష్ట శక్తిని, 137 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బ్రెజ్జాలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందించారు. మీరు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో పాడిల్ షిఫ్టర్‌లను కూడా అందించారు.
మొదటిసారిగా అనేక ఫీచర్లు అందుబాటులోకి..
ఇందులో నలుపు రంగులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను అందించారు. ఇది ఏ మారుతీ కారులోనైనా మొదటిసారిగా వస్తోంది. అదే సమయంలో ఇటీవల విడుదల చేసిన బాలెనో ఫేస్‌లిఫ్ట్ నుంచి అనేక ఫీచర్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో 9-అంగుళాల ఫ్లోటింగ్ SmartPlay Pro+ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్ అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా ఉన్నాయి. ఇది కాకుండా, ఈ కారు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లతో రానుంది.
ఈ కారులో సరౌండ్ సౌండ్ సెన్స్ ఆడియో టెక్నాలజీని అందించారు. దీనితో పాటు క్యాబిన్‌లో ఆంబియన్స్ మూడ్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా అందించారు. కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వాయిస్ కంట్రోల్‌పై పని చేస్తుంది. ఈ కారు తొమ్మిది రంగుల్లో రానుంది. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ డ్యూయల్ టోన్ ఉండగా, 6 కలర్ ఆప్షన్‌లు సింగిల్ టోన్ కలర్‌లో ఉన్నాయి. పెర్ల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, బ్రేవ్ ఖాకీ, ఎక్సుబరెంట్ బ్లూ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. అదే సమయంలో ఈ కారు LXi, VXi, ZXi, ZXi ప్లస్ వేరియంట్లలో వస్తుంది.
కొత్త బ్రెజ్జాలో భద్రతపై దృష్టి..
కొత్త బ్రెజ్జా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కంపెనీ ప్రయత్నించింది. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ABS, పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఎంపికతో కూడిన స్పీడ్ మానిటర్ వంటి దాదాపు 40 కనెక్ట్ చేసిన కార్ ఫీచర్‌లను కలిగి ఉంది.
20.15 KMలతో సూపర్ మైలేజ్..
కొత్త బ్రెజ్జా డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT టెక్నాలజీని కలిగి ఉంది. దీని కారణంగా, ఈ కారులో లీటర్ పెట్రోల్ 20.15 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.
కొత్త బ్రెజ్జా లుక్..
ఈ కారు ఎక్ట్సీరియర్ లుక్‌లో చాలా అందంగా ఉంది. దీని ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మార్చారు. అదే సమయంలో, దాని బంపర్ మునుపటి కంటే కొంచెం స్పోర్టివ్‌గా చేశారు. ముందు భాగంలో, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారంలో LED DRLలు ఉన్నాయి. అదే సమయంలో, వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు ఇచ్చారు. ఇది 4 మీటర్ల లోపు ఉన్న SUV. దీని పొడవు 3995mm, వెడల్పు 1790mm, ఎత్తు 1685mmగా ఉంది. ఇక వీల్‌బేస్ 2500mmగా అందించారు. ఇంటీరియర్‌లో దీనికి డ్యూయల్ టోన్ టచ్ ఇచ్చారు. ఇది బ్రౌన్, బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తుంది.
కొత్త మారుతి బ్రెజ్జా 2022 ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వివిధ వేరియంట్‌ల ప్రకారం దీని గరిష్ట ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.96 లక్షల వరకు ఉంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 45,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను వచ్చాయని కంపెనీ పేర్కొంది.