27 సిక్స్‌లు, 19 ఫోర్లు.. 242 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. రోహిత్ శర్మ రికార్డ్ స్కోర్‌ను బీట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు..

తన్మయ్ సింగ్(Tanmay Singh) బ్యాట్ నుంచి వచ్చిన 268 పరుగులు క్లబ్ క్రికెట్‌లో వచ్చాయి. ఈ మ్యాచ్ 35 ఓవర్లే కావడం గమనార్హం. గ్రేటర్ వ్యాలీ మైదానంలో RRCAతో ఆడిన మ్యాచ్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరపున..

27 సిక్స్‌లు, 19 ఫోర్లు.. 242 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. రోహిత్ శర్మ రికార్డ్ స్కోర్‌ను బీట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు..
Tanmay Singh And Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2022 | 2:35 PM

వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఓ 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అంతకంటే భారీ స్కోరు చేసి, ఆకట్టుకున్నాడు. అతను తన ఇన్నింగ్స్‌లో రోహిత్ కంటే 4 పరుగులు ఎక్కువే చేశాడు. అతనిలా ఓపెనింగ్ చేస్తూనే భారీ స్కోర్‌ల స్క్రిప్ట్‌ను రాశాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌ల మధ్య కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ వేదికగా నిలిచిన 50 ఓవర్ల మ్యాచ్‌లో రోహిత్ 264 పరుగులు చేయగా.. అదే సమయంలో, 15 ఏళ్ల ఓపెనర్ తన్మయ్ సింగ్ బ్యాట్ నుంచి వచ్చిన 268 పరుగులు క్లబ్ క్రికెట్‌లో రాలాయి. ఈ మ్యాచ్ కేవలం 35 ఓవర్లే కావడం గమనార్హం. గ్రేటర్ వ్యాలీ మైదానంలో RRCAతో జరిగిన మ్యాచ్‌లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరపున కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఈ పరుగులు చేశాడు.

తన జట్టు దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కు తన్మయ్ సింగ్ కెప్టెన్‌గా ఉండడమే గొప్ప విషయం. ఇక కెప్టెన్‌గా అతడు ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌లు జట్టుకు భారీ విజయాన్ని అందించాయి. సిక్స్‌లు, ఫోర్లతో తన్మయ్ సింగ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తొలుత 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 464 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు RRCA 32 ఓవర్లలో కేవలం 236 పరుగులకు ఆలౌటైంది. అంటే తన్మయ్ సింగ్ ఒక్కడు చేసిన పరుగులు కూడా ఆజట్టు చేయలేకపోయింది. ఫలితంగా దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ 228 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

రోహిత్ శర్మ కంటే భారీ ఇన్నింగ్స్..

ఇవి కూడా చదవండి

15 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన్మయ్ సింగ్ ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్నాడు. దాదాపు 242 స్ట్రైక్ రేట్‌తో 268 పరుగులు చేశాడు. ఇందులో 27 సిక్సర్లు, 19 ఫోర్లు ఉన్నాయి. తన్మయ్ చేసిన ఈ స్కోరు రోహిత్ శర్మ సాధించిన దాని కంటే 4 పరుగులు ఎక్కువ. ఇది వన్డే క్రికెట్‌లో అతని పేరిట ప్రపంచ రికార్డుగా నమోదైంది.

శిష్యుడి పేలుడు ఇన్నింగ్స్‌పై కోచ్ సంతోషం..

తన్మయ్ సింగ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. దానిని క్రికెట్ కోచ్ లలిత్ బిధురి మెరుగుపరుస్తున్నారు. కోచ్‌లిట్ బిధురి తన 268 పరుగుల ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. తన్మయ్ స్కోరు 250 ప్లస్ దాటడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చాడు. ఇలా 250 ప్లస్ స్కోర్ చేయడం ఇది మూడోసారి. అతనికి పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఇన్నింగ్స్‌లు అతని నుంచి వస్తాయి. తన్మయ్ సింగ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఆడాలనుకుంటున్నాడు. దాని కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇకెందుకు ఆలస్యం.. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి..