Watch Video: సుధీర్ఘ ఫార్మాట్‌లో టీ20 షాట్.. రివర్స్ స్కూప్‌తో షాకిచ్చిన టెస్ట్ బ్యాటర్.. ఆశ్చర్యపోతోన్న నెటిజన్లు..
ఐదవ రోజున ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి, న్యూజిలాండ్ టీంకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో 3-0తేడాతో ఇంగ్లండ్ టీం టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఐదో రోజు ఛేజింగ్‌లో ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో..
టీ20 క్రికెట్ టెస్టులపై కూడా చాలా ప్రభావాన్ని చూపుతోంది. టీ20 జట్టులో ఆడని రూట్ లాంటి టెస్ట్ బ్యాట్స్‌మెన్‌పై కూడా ఆ మార్పు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ దీనిని రుజువు చేశాడు. క్రికెట్ ప్రపంచం కళ్లు చెదిరేలా రూట్ షాట్ ఆడాడు. T20, ODIలలో కూడా ఇటువంటి షాట్లు చాలా అరుదుగా చూస్తుంటాం. కాబట్టి జో రూట్ లాంటి టెస్టు బ్యాట్స్‌మెన్ నుంచి ఇలాంటి షాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. రూట్ రివర్స్ స్కూప్ షాట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ షాట్‌ను ఎవరు చూస్తున్నా, టీ20 పోరు టెస్టు క్రికెట్‌ను కూడా మార్చేసింది అనిపించకమానదు.
Joe Root. You are ridiculous.
ఇవి కూడా చదవండిScorecard/clips: https://t.co/AIVHwaRwQv
??????? #ENGvNZ ?? pic.twitter.com/0YIhsZ5T04
— England Cricket (@englandcricket) June 26, 2022
ఐదవ రోజున ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి, న్యూజిలాండ్ టీంకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో 3-0తేడాతో ఇంగ్లండ్ టీం టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఐదో రోజు ఛేజింగ్‌లో ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో జో రూట్ ఈ షాట్ ఆడాడు. ఇన్నింగ్స్ 22వ ఓవర్ బౌలింగ్ చేసిన పేసర్ వాంగర్ ఈ భారీ షాట్‌కు బలయ్యాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ స్కోరు 2 వికెట్లకు 94 పరుగులుగా నిలిచింది. ఆ ఓవర్‌లోని చివరి బంతిని వాంగర్ కొంచెం నెమ్మదిగా బౌల్ చేశాడు. అది లెగ్-స్టంప్ వెలుపల పడింది. ఈ బాల్ రివర్స్ స్వీప్ కాదు. కానీ, మాజీ కెప్టెన్ రివర్స్ స్కోప్ చేసి థర్డ్ మ్యాన్‌పై ఆరు పరుగులు సాధించాడు. ఈ షాట్‌కి మైదానంలో ఉన్న ప్రేక్షకుల నుంచి స్పందన రావడమే కాకుండా, సోషల్ మీడియా కూడా దీనిపై విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా దాని అధికారిక ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ఈ షాట్‌ను ప్రశంసించింది.