AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వాట్ ఏ సూపర్ క్యాచ్.. జాంటీ రోడ్స్ బ్రదరే అంటూ పొగడ్తలు.. వీడియో వైరల్

ఉగాండా CWC ఛాలెంజ్ లీగ్‌ గ్రూప్ Bలో కెన్యా vs ఉగాండా మ్యాచ్‌లో కెన్యా ఓడిపోయింది. మ్యాచ్ సమయంలో ఫ్రాంక్ న్సుబుగా అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.

Watch Video: వాట్ ఏ సూపర్ క్యాచ్.. జాంటీ రోడ్స్ బ్రదరే అంటూ పొగడ్తలు.. వీడియో వైరల్
Cwc Challenge League Group B Viral Video
Venkata Chari
|

Updated on: Jun 27, 2022 | 3:09 PM

Share

క్యాచ్‌లు పడితే మ్యాచ్‌లు గెలుస్తారనే సంగతి క్రికెటర్లకు బాగా తెలుసు. అందుకే క్యాచ్‌లు పట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇందులో కొందరు సఫలమైతే, మరికొందరు విఫలమవుతుంటారు. ఇంకొందరైతే గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ పట్టేదాకా వదిలిపెట్టరు. సరిగ్గా ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఉగాండాకు చెందిన ఓ సీనియర్ ఆటగాడు ఈ సామెతను మరోసారి నిజమని నిరూపించాడు. 41 ఏళ్ల ఉగాండా ఆటగాడు పట్టుకున్న క్యాచ్‌ను చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. CWC ఛాలెంజ్ లీగ్ గ్రూప్ B మ్యాచ్‌(CWC Challenge League Group B)లో కెన్యా వర్సెస్ ఉగాండా మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లోనే అద్భుతమైన క్యాచ్ కనిపించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్యాచ్‌ను ఫ్రాంక్ న్సుబుగా(Frank Nsubuga) పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

క్యాచ్ అంటే ఇదే అంటోన్న నెటిజన్లు..

ఇవి కూడా చదవండి

ఫ్రాంక్ న్సుబుగా క్యాచ్ పట్టిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసింది. ఇందులో ఈ ఆటగాడు మిడ్‌వికెట్ వద్ద నిలబడి, బ్యాట్స్‌మన్ ముందుకు వెళ్లి భారీ షాట్ ఆడాడు. కానీ, బంతి బ్యాట్‌కి సరిగ్గా తగలకపోవడంతో స్క్వేర్ లెగ్ బౌండరీ వైపుగా బంతి గాలిలోకి వెళ్లింది. 41 ఏళ్ల ఫ్రాంక్ న్సుబుగా బంతిని పట్టుకోవడానికి వెనుకకు పరుగెత్తాడు. ఆ తర్వాత అతను అద్భుతమైన డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఫ్రాంక్ న్సుబుగా పట్టిన ఈ క్యాచ్ జాంటీ రోడ్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది.

ఉగాండా భారీ విజయం..

ఈ మ్యాచ్‌లో కెన్యాపై ఉగాండా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా జట్టు 220 పరుగులకే కుప్పకూలడంతో ఉగాండా 45.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది. ఉగాండా తరపున సైమన్ సిసాజీ 112 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేశాడు. రౌనక్ పటేల్ కూడా 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దినేష్ నక్రానీ 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సీడబ్ల్యుసీ ఛాలెంజ్ లీగ్ గ్రూప్ బిలో ఉగాండా మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ జట్టు 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, కెన్యా జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే గెలిచింది. జెర్సీ జట్టు కూడా 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. హాంకాంగ్ 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తలు, వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..