Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. వివరాలివే..!

కొత్త నెల ప్రారంభం కాకముందే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వస్తున్నాయో తెలుసుకోవాలి. జులై నెల రాబోతుంది. కాబట్టి బ్యాంక్ సెలవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. వివరాలివే..!
Bank
Follow us
Venkata Chari

|

Updated on: Jun 26, 2022 | 6:28 PM

Bank Holidays In July 2022: మీకు జులై నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే.. ఆ నెలలో ఎన్ని రోజులు పని చేస్తాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అనేక పనులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కస్టమర్లు.. బ్యాంకుల హాలీడేస్, సేవలు తదితర అంశాలపై అప్‌డేట్స్‌ కోసం చూస్తుంటారు. అయితే, జులై నెలలో దేశ వ్యాప్తంగా ఆయా బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో వారాంతపు సెలవులు, ఆయా రాష్ట్రాల్లో పండుగలు ఉన్నాయి. వాస్తవానికి ఈ బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. సెంట్రల్ బ్యాంకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్, పబ్లిక్‌ బ్యాంకులకు సంబంధించి నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ సెలవులు మూడు రకాలుగా వర్గీకరించింది. వీటిలో ఒకటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవులు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఇచ్చే సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్ ఉంటాయి.

జులైలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. బక్రీద్ పర్వదినం సందర్భంగా జూలై 9న బ్యాంకులు మూతపడనున్నాయి. ఇది కాకుండా ఈ నెల 5 ఆదివారాలు, 2 శనివారాలు కూడా బ్యాంకులు పనిచేయవు. దేశంలో సాధారణ రోజుల్లో, బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల ట్రాన్‌జాక్షన్స్ జరుగులుంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలైలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, ఇవి మొత్తం దేశంలో ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను జారీ చేస్తారు. రాబోయే జులై నెలలో వచ్చే వివిధ సెలవుల జాబితాను ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

జులైలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు సెలవుల జాబితా..

  1. జులై 1: కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర – భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్‌లు పనిచేయవు.
  2. జులై 3: ఆదివారం (వారాంతపు సెలవు)
  3. జులై 5: మంగళవారం – గురు హరగోవింద్ సింగ్ జి ప్రకాష్ దివాస్ – జమ్మూ అండ్ కాశ్మీర్
  4. జులై 7: ఖర్చి పూజ – అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు
  5. జులై 9: శనివారం (నెలలో రెండవ శనివారం), ఈద్-ఉల్-అజా (బక్రీద్)
  6. జులై 10: ఆదివారం (వారాంతపు సెలవు)
  7. జులై 11: ఈద్-ఉల్-అజా- జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూతపడతాయి
  8. జులై 13: భాను జయంతి- గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్‌లు పనిచేయవు
  9. జులై 14: బెన్ డియెంక్లామ్ – షిల్లాంగ్‌లో బ్యాంక్‌లు పనిచేయవు
  10. జులై 16: హరేలా – డెహ్రాడూన్ బ్యాంక్
  11. జులై 17: ఆదివారం (వారాంతపు సెలవు)
  12. జులై 23: శనివారం (నాల్గవ శనివారం)
  13. జులై 24: ఆదివారం (వారాంతపు సెలవు)
  14. జులై 31: ఆదివారం (వారాంతపు సెలవు)