Ranji Trophy 2022: ముంబైకి షాకిచ్చిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ కైవసం..

మధ్యప్రదేశ్ తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.

Ranji Trophy 2022: ముంబైకి షాకిచ్చిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ కైవసం..
Ranji Trophy 2022
Follow us

|

Updated on: Jun 26, 2022 | 3:37 PM

మధ్యప్రదేశ్ తొలిసారిగా రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చారిత్రాత్మక విజయంలో రజత్ పాటిదార్ హీరోగా మారాడు. చివరి వరకు జట్టును వీడకుండా, విజయాన్ని అందించాడు. మధ్యప్రదేశ్‌కు ముంబై నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. అంతకుముందు, ఫైనల్ చివరి రోజు, మధ్యప్రదేశ్ బౌలర్లు ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 269 పరుగులకే పరిమితం చేశారు. ముంబై రెండో ఇన్నింగ్స్‌లో కుమార్ కార్తికేయ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు.

మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు..

అంతకుముందు మధ్యప్రదేశ్ బౌలర్లు జట్టుకు శుభారంభం అందించి పృథ్వీ షా నేతృత్వంలోని ముంబై జట్టు 374 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను నిలిపివేశారు. ముంబై తరుపున సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసినప్పటికీ గౌరవ్ యాదవ్, అనుభవ్ అగర్వాల్‌ల ఘోరమైన బౌలింగ్‌కు ముంబై మిగతా బ్యాట్స్‌మెన్లు నిలువలేకపోయారు. గౌరవ్ 106 పరుగులిచ్చి 4 వికెట్లు, అనుభవ్ 81 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. బౌలర్ల తర్వాత, మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ తమ సత్తాను ప్రదర్శించి తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులు చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. మధ్యప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 3 సెంచరీలు వచ్చాయి. యశ్ దూబే 133 పరుగులు, శుభమ్ శర్మ 116 పరుగులు, రజత్ పాటిదార్ 122 పరుగులు చేశారు. అదే సమయంలో శరాన్ష్ జైన్ 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 3 సెంచరీల బలంతో మధ్యప్రదేశ్ జట్టు ముంబైపై ఒత్తిడి తెచ్చింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ ముంబై బ్యాట్స్‌మెన్స్ విఫలం..

ఇప్పటికే ముంబై తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ముంబై బ్యాట్స్‌మెన్స్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ముంబై తరపున సువేద్ పార్కర్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. కెప్టెన్ షా 44 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 45 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కుమార్ కార్తికేయ 98 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 269 పరుగుల వద్ద నిలిపివేశాడు. 108 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ జట్టు 29.5 ఓవర్లలో ఛేదించింది. రజత్ పాటిదార్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!