AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుమార్తె.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న సూపర్ ఇన్‌స్వింగర్..

తన రెడ్ హాట్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న రూట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ కుమార్తె బౌలింగ్‌ను ఎదుర్కొనలేకపోయాడు. ఆమె బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Watch Video: జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుమార్తె.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న సూపర్ ఇన్‌స్వింగర్..
Nz Vs Eng Paul Collingwood's Daughter
Venkata Chari
|

Updated on: Jun 26, 2022 | 8:27 PM

Share

అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్ పేరు తెలియని వారు ఉండరు. సెంచరీలు అవలీలగా చేసే బ్యాటర్‌గా పేరుగాంచిన ఈ ఇంగ్లండ్ ప్లేయర్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లను చీల్చి చెండాడతాడు. అతని ప్రస్తుత ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు ఆటగాళ్లలో అతనికి చోటు దక్కింది. అయితే తన రెడ్ హాట్ ఫామ్‌తో దూసుకెళ్తోన్న రూట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ కుమార్తె బౌలింగ్‌ను ఎదుర్కొనలేకపోయాడు. ఆమె బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మాజీ కెప్టెన్ కుమార్తె జో రూట్‌(Joe Root)ను తన ఇన్‌స్వింగర్‌తో బోల్తా కొట్టించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. నెటిజన్లు కూడా ఆమెను ఆకాశానికెత్తుతున్నారు.

జో రూట్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ని ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌ హెడింగ్లీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 360 పరుగులు చేయగా, జో రూట్ 5 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, సిరీస్‌లోని 5 ఇన్నింగ్స్‌లలో, అతను 2 సెంచరీలతో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

క్లీన్ బౌల్డ్ చేసిన మాజీ కెప్టెన్ కూతురు..

3 టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకు 2 సెంచరీలు చేసిన జో రూట్.. పాల్ కాలింగ్‌వుడ్ కుమార్తె బౌలింగ్‌ను ఎదుర్కొనలేకపోయాడు. ఖచ్చితమైన ఇన్‌స్వింగర్‌తో జోరూట్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ప్రాక్టీస్‌లో భాగంగా జరిగింది. కాగా, పాల్ కాలింగ్‌వుడ్, తన కూతురిని దగ్గరుండి మరీ కోచింగ్ ఇస్తున్నాడు. బౌలింగ్‌లో రకరకాల బంతులను ఉపయోగించి, ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఈమేరకు మరో వీడియోను కూడా చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..