క్రెడిట్‌కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై అలా చేస్తే బ్యాంకులకు భారీగా ఫైన్లు.. జులై 1 నుంచే సరికొత్త రూల్స్..
Credit Card Payments: ఏ బ్యాంకు లేదా క్రెడిట్ కంపెనీ తన స్వంత ఇష్టానుసారం ఏ కస్టమర్‌కు క్రెడిట్ కార్డ్ ఇవ్వదు. కస్టమర్ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డ్ జారీ చేయబడినా లేదా కార్డును అప్‌గ్రేడ్ చేసినా, అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
Credit Card Charges: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని నియమాలను మార్చింది. ఈ కొత్త అప్‌డేట్‌లు జులై 1 నుంచి వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. కొత్త మార్పులతో యూజర్లకు భారీ ఊరటను అందించింది. ఇందులో అత్యంత ముఖ్యమైనవి క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్, క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడం లాంటివి ఎన్నో ఉన్నాయి. బిల్లింగ్ సైకిల్, క్రెడిట్ కార్డ్ మూసివేతకు సంబంధించి కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలు లేకుండా కోతలు పెట్టింది. కస్టమర్లకు ఈ సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ అవసరమైన మార్పులు చేసింది. బ్యాంకులు ఈ మార్పులకు లోబడి కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానాలు విధించే చాన్స్ ఉంది. RBI ప్రకారం, మార్పులకు సంబంధించిన అనేక నియమాలు జులై 1 నుంచి వర్తిస్తాయి. అయితే కొన్ని నియమాలు అక్టోబర్ వరకు పొడిగించింది. డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులు, కంపెనీలకు RBI కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1- తప్పుడు బిల్లులకు ఇక సెలవు..
కస్టమర్‌కు తప్పుడు బిల్లులు ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత కార్డు జారీ చేసే బ్యాంకు లేదా క్రెడిట్ కంపెనీపై ఉంటుంది. కస్టమర్‌కు తన బిల్లుల్లో ఏదైనా సందేహం ఉంటే, తప్పును గ్రహించి బ్యాంకు లేదా కంపెనీకి ఫిర్యాదు చేస్తే, వెంటనే దానిని తీర్చాలి. బ్యాంకు లేదా కంపెనీ ఫిర్యాదుపై 30 రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుంది. అవసరమైతే, బ్యాంక్ తన బిల్లుకు మద్దతుగా కాగితం రుజువును కూడా అందించవలసి ఉంటుంది. బ్యాంకు లేదా కంపెనీ కస్టమర్‌కు వ్రాతపూర్వకంగా స్పందించాల్సి ఉంటుంది.
2- బిల్లు పంపడంలో జాప్యం ఉండొద్దు..
క్రెడిట్ కార్డ్ బిల్లులపై వడ్డీని పొందడానికి ఏ బ్యాంక్ లేదా క్రెడిట్ కంపెనీ ఆలస్యంగా బిల్లులను పంపకూడదు. బ్యాంకులు లేదా కంపెనీలు క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో పంపించాలని ఆర్‌బీఐ పేర్కొంది. తద్వారా కస్టమర్ బిల్లును చెక్ చేసుకుని, బిల్లును చెల్లించడానికి తగినంత సమయం ఉంటుంది. సమయం ఇవ్వకుండా క్రెడిట్ కార్డ్ బిల్లులపై పెనాల్టీ విధించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు కస్టమర్‌కు సకాలంలో అందుతున్నట్లు ధృవీకరించడానికి కార్డ్ జారీచేసేవారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌బీఐ పేర్కొంది.
3- కార్డ్‌లను 7 రోజుల్లో రద్దు చేయకుంటే.. రోజుకు రూ. 500 జరిమానా..
ఒక కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయమని అభ్యర్థిస్తే, కంపెనీ లేదా బ్యాంక్ దానిని సిరీయస్‌గా తీసుకోవాలి. ఈ పనిలో జాప్యం ఉండకూడదు. కార్డ్ మూసివేత ప్రక్రియను 7 పనిదినాల్లోపు పూర్తి చేయాలి. అలా చేయకపోతే జరిమానా విధిస్తారు. కార్డ్ క్లోజ్ అయిన వెంటనే, దాని సమాచారాన్ని కస్టమర్‌కు ఇమెయిల్, SMS మొదలైన వాటి ద్వారా వెంటనే అందించాలి. 7 రోజుల్లోగా కార్డును మూసివేయకపోతే, రోజుకు రూ. 500 జరిమానా పడనుంది. కార్డ్ మూసివేసిన రోజు వరకు ఈ పెనాల్టీ వర్తిస్తుంది. అయితే, కార్డ్‌పై ఎలాంటి బాకీ లేకపోతే మాత్రమే దాన్ని రద్దు చేయమని కోరాల్సి ఉంటుంది.
4- యూజర్ ఇష్టం లేకుండా కార్డ్ జారీ చేయకూడదు.. లేదంటే రెండింతల జరిమానా..
ఏ బ్యాంకు లేదా క్రెడిట్ కంపెనీ తన స్వంత ఇష్టానుసారం ఏ కస్టమర్‌కు క్రెడిట్ కార్డ్ ఇవ్వకూడదు. కస్టమర్ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డ్ జారీ చేసినా లేదా కార్డును అప్‌గ్రేడ్ చేసినా, అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అలాంటి కార్డుపై వినియోగదారుడి నుంచి బిల్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. బ్యాంక్ లేదా కంపెనీ డబ్బును తిరిగి ఇవ్వడమే కాకుండా రివర్స్ ఛార్జీకి రెండింతలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
5- బిల్లింగ్ సైకిల్‌లో కీలక మార్పులు..
రిజర్వ్ బ్యాంక్ బిల్లింగ్ సైకిల్ నియమాన్ని కూడా నిర్ణయించింది. బిల్లింగ్ సైకిల్ అంటే బిల్లు జనరేట్ అయిన సమయం నుంచి వచ్చే ఒక నెల వరకు ఉంటుంది. దీని తర్వాత కొన్ని అదనపు రోజులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్రెడిట్ కార్డ్ బిల్లును డిపాజిట్ చేయాలి. మొత్తం వ్యవధి 55 రోజుల వరకు ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించినట్లయితే, అప్పుడు వడ్డీ వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ అనేది రెండు వరుస బిల్లుల ముగింపు తేదీల మధ్య వ్యవధి అనే సంగతి తెలిసిందే. బిల్లు చెల్లింపు తేదీ సాధారణంగా బిల్లింగ్ సైకిల్ ముగిసిన 15-25 రోజుల తర్వాత ఉంటుంది. కానీ, కొత్త రూల్ ప్రకారం.. బిల్లింగ్ సైకిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. బిల్లింగ్ సైకిల్ 11 జూన్, 2022 నుంచి 10 జులై, 2022 వరకు ఉంటుందనుకుంటే.. చెల్లింపు గడువు తేదీ ఆగస్ట్ 4-5, 2022లో లేదా అంతకు ముందు రావచ్చన్నమాట