మగువలు ఎక్కువ ఇష్టపడేదాంట్లో బంగారం ముందుంటుంది. ఏ చిన్న ఫంక్షన్ కు వెళ్లినా సరే ఒంటినిండా బంగారం ధరించాలని ఆరాటపడుతుంటారు మహిళలు.
అంతే కాకుండా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి చేయాలి అనుకుంటే ముందు బంగారం ముచ్చటే వస్తుంది.
కానీ, ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి.
భారత్ లో బంగారం ధర దాదాపు లక్షకు చేరువలో ఉంది. దీంతో సామాన్యలు బంగారం కొనులు చేయడానికి భయపడిపోతున్నారు.కానీ ఈ మధ్యలో బంగారం తరలింపు అని అనేక వార్తలు వస్తున్నాయి.
విదేశాల నుంచి చాలా మంది బంగారంతీసుకొచ్చుకుంటారు. ముఖ్యంగా దుబాయ్ నుంచి విపరీతంగా బంగారం రవాణా చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడితో పోలిస్తే అక్కడ బంగారం ధర చాలా తక్కువ.
మరి దుబాయ్ లో బంగారం ధర ఎందుకు తక్కువో ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించే తెలుసుకుందాం. దుబాయ్ లో బంగారం తక్కువ ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయంట
అక్కడ బంగారం కోనుగోళ్లపై ఎలాంటి పన్ను ఉండదంట.అంతే కాకుండా అక్కడ ఎలాంటి అదనపు పన్ను చెల్లించకుండా మార్కెట్ ధరకు బంగారం కొనుగోలు చేసుకోవచ్చునంట.
అంతే కాకుండా అక్కడ పసిడి వర్తకుల మధ్య చాలా పోటి ఉంటుందంట. దాంతో పెద్ద ఎత్తున ఆఫర్ల కారణంగా గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉంటుందంట.