AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: 16 బంతుల్లో 44 రన్స్‌తో దుమ్మురేపాడు.. కానీ, సొంత టీమ్‌ ఫ్యాన్స్‌ నుంచి పచ్చి బూతులు! ఎందుకంటే..?

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశాన్ని ఇవ్వకపోవడంతో అభిమానులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. శశాంక్ అయితే తనకు స్ట్రైక్ అవసరమని, అయ్యర్ అలా చెప్పాడని స్పష్టం చేశాడు.

IPL 2025: 16 బంతుల్లో 44 రన్స్‌తో దుమ్మురేపాడు.. కానీ, సొంత టీమ్‌ ఫ్యాన్స్‌ నుంచి పచ్చి బూతులు! ఎందుకంటే..?
Shreyas Iyer Shashank Singh
SN Pasha
|

Updated on: Mar 26, 2025 | 10:13 AM

Share

ఐపీఎల్‌ 2025లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ విజయం సాధించింది. అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో 11 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ శశాంక్‌ సింగ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు సాధించాడు. అవే చాలా వ్యాల్యూబుల్‌ రన్స్‌గా మారాయి. ఎందుకంటే.. గుజరాత్‌ కూడా పంజాబ్‌ టార్గెట్‌కు చాలా దగ్గరగా వచ్చేసింది. కేవలం 11 పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది.

చివర్లో శశాంక్‌ ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉంటే.. బహుషా మ్యాచ్‌ ఫలితం వేరేలా కూడా ఉండేదేమో. అంత ఇంప్యాక్ట్‌ఫుల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత కూడా శశాంక్‌ సింగ్‌పై పంజాబ్‌ కింగ్స్ ఫ్యాన్స్‌ పచ్చిబూతులతో విరుచుకుపడుతున్నారు. అందుకు కారణం.. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ చేసేందుకు శశాంక్‌ ఛాన్స్‌ ఇవ్వకపోవడమే. పంజాబ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 18.5 ఓవర్లు ముగిసిన తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్నాడు. ఇంకో మూడు రన్స్‌ చేస్తే.. సెంచరీ పూర్తి చేసుకుంటాడు. ఆ ఓవర్‌లో చివరి బంతికి శశాంక్‌ సింగ్‌.. సిక్సో, ఫోరో బాదేస్తే.. చివరి ఓవర్‌లో అయ్యర్‌ ఎలాగో సెంచరీ పూర్తి చేసుకుంటాడని అంతా భావించారు.

కానీ, శశాంక్‌ చివరి బాల్‌కు సింగిల్‌ తీసుకొని స్ట్రైక్‌ను తన వద్ద ఉంచుకున్నాడు. పోనీ చివరి ఓవర్‌లోనైనా సింగిల్‌ తీసి అయ్యర్‌కు స్ట్రైక్‌ ఇస్తాడేమో అనుకుంటే.. ఓవర్‌ మొత్తం ఒక్కడే ఆడేశాడు. ఐదు ఫోర్లు, ఒక డబుల్‌తో ఆ ఓవర్‌లో వైడ్లతో కలుపుకొని ఏకంగా 28 పరుగులు సాధించినా.. అయ్యర్‌ సెంచరీ పూర్తి చేసుకోవడానికి స్ట్రైక్‌ ఇవ్వలేదని కొంతమంది పంజాబ్‌ ఫ్యాన్స్ శశాంక్‌ను తిట్టిపోస్తున్నారు. కాగా, తనకు స్ట్రైక్‌ అవసరం లేదని, నా సెంచరీ కోసం నువ్వేమి ఆలోచించాల్సిన అవసరం లేదని, నీ షాట్లు నువ్వు ఆడాల్సిందిగా అయ్యరే తనకు చెప్పాడని శశాంక్‌ క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.