AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT: మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు! కారణం ఏంటంటే..?

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించాడు. అయితే, సాయి సుదర్శన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో గ్లెన్ మ్యాక్స్ వెల్ కి క్షమాపణ చెప్పాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PBKS vs GT: మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు! కారణం ఏంటంటే..?
Shreyas Iyer Maxwell
SN Pasha
|

Updated on: Mar 26, 2025 | 10:44 AM

Share

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ ఐపీఎల్‌ 18వ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అలాగే పంజాబ్‌ కెప్టెన్‌గా తొలి విజయాన్ని కూడా అందుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 11 పరుగుల తేడాతో గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌, ఆ టీమ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు సారీ చెప్పాడు. అతని అయ్యర్‌ ఎందుకు సారీ చెప్పా్ల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ ఛేజింగ్‌ చేస్తున్న సమయంలో వాళ్ల ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు.

మంచి ఓపెనింగ్‌ పార్ట్నర్‌షిప్‌తో పాటు.. బట్లర్‌తో కలిసి కీలక పార్ట్నర్‌షిప్‌ను నెలకొల్పాడు. మొత్తంగా 41 బంతుల్లో 74 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే డేంజరస్‌గా ఆడుతున్న సాయి సుదర్శన్‌ను ముందుగానే అవుట్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. కానీ, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ ఐదో బంతికి సాయి సుదర్శన్‌ కవర్స్‌ పై నుంచి షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. సర్కిల్‌ లోపల ఉన్న కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కాస్త పై నుంచి ఆ బాల్‌ వెళ్తోంది. అది అందుకోవడానికి అయ్యర్‌ గాల్లోకి కాస్త ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, బాల్‌ చేతుల్లో పడి మిస్‌ అయ్యింది. నిజానికి ఇంకాస్త మంచి ఎఫర్ట్‌ పెట్టి, రైట్‌ టైమ్‌లో జంప్‌ చేసి ఉంటే ఆ బాల్‌ అయ్యర్‌ అందుకునే వాడు. మంచి ఫీల్డర్‌గా పేరున్న అయ్యర్‌ స్టాండర్డ్స్ అది కచ్చితంగా అందుకోవాల్సిన క్యాచ్‌.

కానీ, దురదృష్టవశాత్తు అయ్యర్‌ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్‌ డ్రాప్‌ తర్వాత అయ్యర్‌ తన టీమ్‌మేట్‌ అయ్యర్‌కు సారీ చెప్పాడు. ఎందుకంటే.. ఆ ఓవర్‌ వేసింది మ్యాక్స్‌వెల్‌ కాబట్టి. అప్పటికే ఒక వికెట్‌ తీసి.. మంచి జోష్‌లో ఉన్న మ్యాక్సీ ఆల్‌మోస్ట్‌ రెండో వికెట్‌ తీసేశాడు.. కానీ, అయ్యర్‌ పట్టి ఉంటే ఆ రెండో వికెట్‌ వచ్చేది. కానీ, మిస్‌ అయ్యింది. దీంతో అయ్యర్‌, మ్యాక్సీకి వెంటనే సారీ చెప్పాడు. ఇది స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.