Chahal Dhanashree: ముంబైలో వేరే కాపురం..! చాహల్-ధనశ్రీ విడాకులకు కారణమైన సంచలన నిజం!
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులకు నిజ కారణం ముంబైలో నివాసం విషయంలో వచ్చిన విభేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ ముంబైలో కాపురం పెట్టుకోవాలని కోరుకున్నా, చాహల్ హర్యానాలో తల్లిదండ్రులతో ఉండాలని నిర్ణయించుకోవడంతో వారి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ వివాదం చివరకు విడాకులకు దారితీసింది.

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవలె తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ బిజీ ఉన్నాడు. అయితే.. కోర్టులో పరస్పర అంగీకరంతో విడిపోతున్నట్లు ఈ చాహల్, ధనశ్రీ ప్రకటించినప్పటికీ.. వారి విడాకులకు ఒక బలమైన కారణం ఉందనే సంచలన విషయం తాజాగా బయటపడింది. అసలు విషయం ఏంటంటే.. 2020లో చాహల్, ధనశ్రీ వర్మ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ధనశ్రీ హర్యానాలోని చాహల్ ఇంట్లో భర్త, అత్తమామలతోనే కలిసి ఉంటుంది.
డ్యాన్స్ షోలతో పాటు ఇతర అత్యవసర పనులు ఉన్న టైమ్‌లో హర్యానా నుంచి ముంబైకి వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మనం ముంబైలోని ఉందామని చాహల్‌ను కోరింది ధనశ్రీ. కానీ, అందుకు చాహల్ ఒప్పుకోలేదు. తన తల్లిదండ్రులతో పాటు ఇక్కడే హర్యానాలోనే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలకు కారణం అయింది. తల్లిదండ్రులతో కలిసి హర్యానాలోనే ఉందామని చాహల్, లేదు.. మనం ముంబైలో వేరే కాపురం పెడదామంటూ ధనశ్రీ పట్టుబట్టారు. ఎక్కడ ఉండాలనే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభ్రియం రాకపోవడంతో.. విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
అందుకోసం ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయగా.. వారికి కోర్టు ఆరు నెలల కూలింగ్ పిరియడ్ ఇచ్చింది. కానీ, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తమకు వెంటనే విడాకులు కావాలని, తాము రెండేళ్లుగా విడివిడిగానే జీవిస్తున్నామంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇలా వేరే కాపురం పెట్టాలనే ఆలోచన ఇద్దరి మధ్య వివాదానికి కారణమై.. చివరికి విడిపోయేలా చేసిందని విశ్వసనీయ సమాచారం. అయితే విషయంపై అటు ధనశ్రీ కానీ, చాహల్ కానీ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ ఈ విషయంపై స్పందించలేదు. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు విడాకుల పిటీషన్‌లో పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.