AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood photo: పుట్టింది హైదరాబాద్‌లో.. ఏలింది బాలీవుడ్‌ని.. ఈ అక్కాచెల్లెలు ఎవరో కనిపెట్టగలరా.?

బాల్యం ఎప్పుడూ ఎవరికైనా అపురుపమే.. ప్రతి ఒక్కరూ తమ బాల్యానికి సంబందించిన జ్ఞాపకాలను పదిల పరచుకుంటారు. ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారు. అదే విధంగా ప్రముఖులు కూడా తమ బాల్యానికి సంబందించిన ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తారు. అలాంటి ఒక ఫోటో నెట్టింట్లో సందడి చేస్తోంది. అందులో ఇద్దరు అక్కాచెల్లెలు.. ఇద్దరూ హీరోయిన్స్ గా చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ పేజీని లిఖిన్చుకున్నారు. అద్భుతమైన నటనతో తమ కంటూ సొంత గుర్తింపును సృష్టించుకున్నారు. ఆ అక్కా చెల్లెలు ఎవరో గుర్తు పట్టారా..

Childhood photo: పుట్టింది హైదరాబాద్‌లో.. ఏలింది బాలీవుడ్‌ని.. ఈ అక్కాచెల్లెలు ఎవరో కనిపెట్టగలరా.?
Chilhood Photo
Surya Kala
|

Updated on: Mar 26, 2025 | 10:26 AM

Share

అమ్మదగ్గర గారాలు పోతున్న చిన్నారులను గుర్తుపట్టగలరా? పర్వాలేదు నేను మీకు చెబుతాను ఆ ఇద్దరు అక్కాచెల్లెలు ఎవరో.. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ ఇద్దరు అక్కాచెల్లెలు మరెవరో కాదు టబు, ఆమె అక్క ఫరా నాజ్. టబూ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి.. అయితే టబు అక్క ఫరా బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. 50 పై గా సినిమాల్లో నటించింది.

ఫరా, టబులకు తెలుగు గడ్డకు సంబంధం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముస్లిం కుటుంబానికి చెందిన జమాల్ అలీ హష్మీ, రిజ్వానా దంపతుల కుమార్తెలు. జమాల్, రిజ్వానా పిల్లలు చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. టబు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షబానా అజ్మీకి ఫరా, టబులు మేనకోడళ్ళు. దీంతో అక్కా చెలెల్లు 1983లో హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

ఫరా 1980ల, 1990లలో హిందీ సినిమాలలో నటించింది. 1985లో ఫాస్లే అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. రాజేష్ ఖన్నా, రిషి కపూర్, సంజయ్ దత్, సన్నీ డియోల్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అమీర్ ఖాన్, మిథున్ చక్రవర్తి, గోవింద, ఆదిత్య పంచోలీ సహా దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో నటించింది. 1996లోనటుడు విందు దారా సింగ్‌తో ఫరా వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారు. వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. తర్వాత 2003లో బాలీవుడ్, టెలివిజన్ నటుడు సుమీత్ సైగల్‌ను రెండో వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

అక్కబాటలోనే చెల్లెలు టబూ కూడా నడిచింది. 1980లో బజార్’ అనే సినిమాలో బాలనటిగా చేసింది. తెలుగులో స్వాతి అనే పేరుతో కూలీ నెంబర్ వన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. అదే సమయంలో టబుకు బాలీవుడ్ లో విజయ్‌పథ్’ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుంది. తర్వాత మళ్ళీ కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్ ఎంచుకుని అగ్రహీరోయిన్ అయింది. ‘మాచీస్ మూవీలో టబు నటనకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. తెలుగులో కూడా నిన్నే పెళ్ళడతా, ప్రేమ దేశం, చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే, అందరివాడు’, ‘పాండురంగడు వంటి సినిమాలతో అలరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.