Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలున్న వ్యక్తుల జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు..
అష్టాదశ పురాణాలలో ఒకటి గరుడ పురాణం. దీనిని వ్యాస మహర్షి రచించారు. ఈ గరుడ పురాణం.. శ్రీ మహా విష్ణువు తన వాహనమైన గరుడునకు ఉపదేశించినట్లు.. అందుకే ఈ పురాణానికి "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. దీనిలో మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించే వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంది. అంతేకాదు ఈ గరుడ పురాణం లో మనిషి జీవితం, మరణం గురించి చెప్పి.. మనిషిని విష్ణు భక్తీ వైపు నడిపిస్తుంది. ఈ రోజు గరుడ పురాణం ప్రకారం ప్రజల జీవితాలను ఇబ్బందుల్లో పడేసే కొన్ని గుణాలను గురించి తెలుసుకుందాం..

గరుడ పురాణం లోక రక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది విష్ణువు పట్ల భక్తి, వైభవాన్ని తెలియజేస్తుంది. దీనితో పాటు, జీవితాన్ని మెరుగుపరిచేందుకు వివిధ విధానాలను వివరించారు. వ్యక్తుల జీవితాన్ని సంతోషంగా లేదా విచారంగా మార్చే కొన్ని పనులను గురించి కూడా వివరించారు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని నారాయణుడు తన వాహనమైన గరుడుడికి చెప్పాడని చెబుతారు. ఈ సమయంలో గరుడుడు జీవితం, మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు విష్ణువుని అడిగాడు. గరుడ పురాణంలో వ్రాయబడిన ప్రతిదాని ఉద్దేశ్యం మానవ జీవితాన్ని సంతోషంగా, సులభతరం చేయడమే. అందులో పేర్కొన్న సూత్రాలు, నియమాలను పాటించడం ద్వారా వ్యక్తీ మరణం తర్వాత ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. గరుడ పురాణంలో పేర్కొన్న ఆ అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. ఎవరికైనా ఆ లక్షణాలు ఉంటే, అతని జీవితంలో సమస్యలు ఎప్పటికీ అంతం కావు.
అహంకారి, గొప్పలు చెప్పుకునేవాడు
అహంకారి అయిన వ్యక్తి తరచుగా ఇతరులను అవమానిస్తాడు. కాలక్రమేణా అతని అహం పెరుగుతుంది. అతని ఆలోచనలు ఇరుకుగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి అత్యుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పుడు అతని పతనం ఖాయం.
దురాశ
గరుడ పురాణం ప్రకారం.. తనది కాని వస్తువులపై.. ఇతరుల సంపదపై ఆశ పడకూడాడు. దురాశ దుఃఖానికి చేటు.. ఇలా ఆలోచనలు చేసే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అతని కోరికలు ఎప్పటికీ అంతం కావు. దురాశ కారణంగా.. అతను తప్పుడు పనులు చేస్తూనే ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఏదోక రోజు అతని సంపద అంతా నాశనమవుతుంది.
రాత్రిపూట పెరుగు తినేవాడు
గరుడ పురాణంలో ఆహారం గురించి అనేక నిమయలను పేర్కొంది. ఇందులో రాత్రి సమయంలో పెరుగు తినడం నిషేధించబడింది. రాత్రి సమయంలో శరీరంలో ఎక్కువ కఫం ఉత్పత్తి అవుతుంది. పెరుగుకు చల్లబరిచే గుణం ఉండటం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరం అనారోగ్యానికి గురైతే.. మీ పనులన్నీ ప్రభావితమవుతాయి. కనుక మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మురికి దుస్తులు
మురికి బట్టలు ధరించే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల ఇంట్లో ప్రతికూలత నెలకొంటుంది. రకరకాల వ్యాధులు వారిని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో శారీరక ఆరోగ్యానికి, డబ్బుకి హాని కలిగిస్తాయి. కనుక సంతోషకరమైన జీవితం కోసం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు