Garuda Purana: గరుడ పురాణంలో ప్రతి పాపానికి ఒక శిక్ష.. ఏయే పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా..
రామాయణం, మహాభారతం వంటి హిందూ పురాణ గ్రంథాలు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి.. తప్పు ఒప్పులను గురించి తెలియజేస్తే.. గరుడ పురాణం మనిషి ఇలలో చేసిన తప్పులకు మరణం తర్వాత పడే శిక్షలను తెలియజేస్తుంది. హిందూ మతంలోని ముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో మరణం, పాప పుణ్యాలు, స్వర్గం, నరకం.. మోక్షం.. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం అలాంటి కొన్ని పాపాల గురించి చెబుతుంది, ఒక వ్యక్తి వాటిని చేస్తే, మరణానంతరం అతనికి కఠినమైన శిక్ష పడుతుంది.

హిందూ మతంలో గరుడ పురాణం అష్టాదశ మహా పురాణాల్లో (18 మహాపురాణాల్లో) ఒకటిగా చేర్చబడింది. లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ప్రసాదించిన జ్ఞానం ఈ గరుడ పురాణం. దీనికి విష్ణువే అధిపతి. గరుడ పురాణం మరణం తరువాత ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తుంది. గరుడ పురాణంలో కూడా స్వర్గం, నరకం గురించి వివరించబడింది. దీనితో పాటు భూమిపై పాపాలు చేసే ఆత్మలకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా చెప్పబడింది.
గరుడ పురాణంలో మరణానంతరం మనిషి ఆత్మ యమరాజు ముందు హాజరుపరచబడుతుందని చెప్పబడింది. అక్కడ చిత్ర గుప్తుడు మనిషి చేసిన కర్మలను అనుసరించి పాప పుణ్యాలను ఎంచి అతని చేసిన కర్మల ఆధారంగా ఆ వ్యక్తిని నరకానికి పంపాలో లేదా స్వర్గానికి పంపాలా అనేది నిర్ణయిస్తారు. అంతేకాదు అతను చేసిన పాప కర్మల ఆధారంగా అతనికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించబడుతుంది. వ్యక్తి తన కర్మలకు వివిధ రకాల శిక్షలను విధిస్తారు. అంతేకాదు వివిధ జాతులలో జన్మించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో గరుడ పురాణం ప్రకారం ఏయే పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం.
హత్యలు చేసే వాళ్ళు ఈ నరకాన్ని అనుభవించాల్సిందే.
గరుణ పురాణంలో 36 నరకాల గురించి వివరణ ఉంది. ఒక వ్యక్తి ఆత్మ నరకానికి పంపబడి అతని కర్మను బట్టి శిక్షించబడుతుంది. గరుడ పురాణంలో భ్రూణహత్య చేసేవారిని మహా పాపులు అంటారు. భ్రూణహత్యలు చేసే వారిని రోధ అనే నరకానికి పంపించి హింసిస్తారు. అలాంటి వారు తదుపరి జన్మలో నపుంసకులు అవుతారు. క్షత్రియులను, వైశ్యులను చంపేవారు తాళ నరకంలోని హింసలను అనుభవించాల్సి ఉంటుంది.
గురువును విమర్శించే వారు
తమకు విద్యా దానం చేసి.. భవిష్యత్ కు బాటలు వేసిన గురువును విమర్శించి అవమానించిన వారిని మరణానంతరం శబల అనే నరకానికి పంపి హింసిస్తారు.
దొంగతనం చేసేవారు..
బంగారం దొంగిలించే వారిని సుకర అనే నరకానికి పంపించి హింసిస్తారు. ఇలాంటి వ్యక్తులు తర్వాతి జన్మలో పురుగు లేదా కీటకంగా జన్మిస్తారు.
రేపిస్టులకు ఈ శిక్ష
స్త్రీలపై చెడు దృష్టి ఉన్నవారు వ్యభిచారం, అత్యాచారం చేస్తారు. అలాంటి వారు కూడా మహా పాపులు. అలాంటి వారి ఆత్మలకు నరకంలో భయంకరమైన హింసలు విధించబడతాయి. పిల్లలను, వృద్ధులను, స్త్రీలను అవమానించే వారికి యమరాజు దూతలు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. కోడలిని కుమార్తెను బలవంతాన అనుభవించేవాడు ‘మహాజ్వాల’ అనే నరకంలో పడతాడు. పరస్త్రీని పొందేవాడు ‘శబల’ అనే నరకంలో పడతాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు