AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papmochani Ekadashi: పాపమోచని ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి.. ఏడాది పొడవునా డబ్బుకు ఇబ్బంది ఉండదు..

పంచాంగం ప్రకారం పాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా ఉపవాసం పాటిస్తారు. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుందని విశ్వాసం ఉంది. పాపమోచని ఏకాదశి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా శ్రీ మహా విష్ణు, లక్ష్మి దేవిల అనుగ్రహం లభిస్తాయని.. శ్రీ హరి విష్ణువు ఆశీస్సులతో కోరిన కోర్కెలు నేరవేతాయని నమ్మకం.

Papmochani Ekadashi: పాపమోచని ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి.. ఏడాది పొడవునా డబ్బుకు ఇబ్బంది ఉండదు..
Papmochani Ekadashi 2025
Surya Kala
|

Updated on: Mar 25, 2025 | 6:38 AM

Share

ప్రస్తుతం తెలుగు నెలల్లో చివరి నెల పాల్గుణ మాసం జరుగుతోంది. ఈ నెలలోని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. పంచాంగం ప్రకారం పాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 25వ తేదీన పాటిస్తారు. ఏకాదశి ఉపవాసం చేసిన విష్ణువును పూజించే ఆచారం ఉంది. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని మత విశ్వాసం ఉంది.

పాపమోచని ఏకాదశి రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతిని కాపాడుతుంది. ఈ ఏకాదశి రోజున జ్యోతిషశాస్త్రం సూచించిన కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. పాపమోచని ఏకాదశి రోజున తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

పాపమోచని ఏకాదశి పరిహారాలు

వ్యాపారంలో లాభం కోసం: పాపమోచని ఏకాదశి రోజున 11 గోమతి చక్రాలు, 3 చిన్న ఒంటి కన్ను కొబ్బరికాయలను తీసుకొని ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్టించండి. తరువాత వాటిని ధూప, దీపాలతో పూజించండి. పూజ తర్వాత గోమతి చక్రం, ఏకాక్షి కొబ్బరికాయను పసుపు వస్త్రంలో కట్టి కార్యాలయం లేదా దుకాణం ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభం వస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి పొందడానికి: పాపమోచని ఏకాదశి రోజున గోమతి చక్రం తీసుకొని సాయంత్రం చీకటి పడిన తర్వాత ఏదైనా ఖాళీ ప్రదేశంలో శ్రీ హరి విష్ణు నామాన్ని ఉచ్చరిస్తూ, గోమతి చక్రాన్ని ఒక గుంతలో పాతిపెట్టండి. దీని తరువాత పెండింగ్‌లో ఉన్న డబ్బును తిరిగి ఇప్పించమని దేవుడిని ప్రార్థించండి. ఈ పరిష్కారం చేయడం ద్వారా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుందని నమ్ముతారు.

ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి: ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 గోమతి చక్రాలను ఉంచి ఆపై ఆలయంలో లక్ష్మీ దేవి ముందు ఉంచండి. ఇప్పుడు లక్ష్మీదేవిని, గోమతి చక్రాన్ని ధూప, దీపాలతో పూజించండి. దీని తరువాత మర్నాడు ఆ గోమతి చక్రాలలో 5 మీ ఇంటి సేఫ్‌లో, 5 గోమతి చక్రాలను మీ దుకాణంలో లేదా ఆఫీసు లోని సేఫ్‌లో ఉంచండి.

మంచి ఆరోగ్యం కోసం- మీ ఆరోగ్యంతో పాటు.. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం పాపమోచని ఏకాదశి రోజున సాయంత్రం తులసి మొక్క కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి విష్ణువును ధ్యానిస్తూ తులసి మొక్క చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం