Vastu Tips: ఇంట్లో శనిశ్వరుడి దిశ ఏమిటో తెలుసా.. పొరపాటున కూడా ఈ వస్తువులు ఈ దిశలో పెట్టవద్దు ఎందుకంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశ శనిశ్వరుడితో ముడిపడి ఉంది. కనుక ఈ దిశలో పెట్టే వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త డబ్బాలు, బూట్లు, బరువైన వస్తువులను ఈ దిశలో ఉంచడం అశుభం. ముదురు రంగులు, విరిగిన వస్తువులను కూడా ఉంచకూడదు. తులసి మొక్కను పెంచకూడదు. పశ్చిమ దిశ తెరిచి ఉండాలి. ఈ దిశలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశ ఒక ప్రత్యేకమైన దేవుడికి అధిపతి కలిగి ఉంటాడు. అంతేకాదు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అదే విధంగా సూర్యుడు తనయుడైన శనిశ్వరుడు కూడా ఒక దిశకు అధిపతి. ఆయన దిశ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. హిందూ మతంలో శనిశ్వరుడిని కర్మ ప్రదాతగా, న్యాయ దేవుడుగా చెబుతారు. శనిశ్వరుడు మనిషి చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు.
- వాస్తు శాస్త్రం ప్రకారం శనిశ్వరుడి దిశ పశ్చిమ దిశగా పరిగణించబడుతుంది. కనుక కొన్ని రకాల వస్తువులను ఈ దిశలో, అంటే పశ్చిమ దిశలో ఉంచడం నిషేధించబడింది. చెత్త డబ్బాను ఇంటికి పశ్చిమ దిశలో పెట్టకూడదు. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనిశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని చెడు పెరుగుతుందని నమ్ముతారు.
- ఇంటి పశ్చిమ దిశలో బూట్లు, చెప్పులు, షూ స్టాండ్‌లు, మురికి బట్టలు మొదలైనవి ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కలుగుతాయి.
- వాస్తు ప్రకారం ఇంటికి పశ్చిమ దిశలో బరువైన ఇనుప వస్తువులు, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా విరిగిన గడియారాలను పొరపాటున కూడా పెట్టకూడదు. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనిపై అశుభ ప్రభావం చూపుతుంది.
- ఇంటికి పశ్చిమ భాగంలో ముదురు ఎరుపు, నలుపు లేదా చాలా ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావంలో అసమతుల్యత ఏర్పడుతుంది, ఇది జీవితంలో కష్టాలను పెంచుతుంది.
- సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం చీపురును ఇంటికి పశ్చిమ దిశలో ఉంచకూడదు. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. కనుక చీపురును పశ్చిమ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని నమ్మకం.
- వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంది. అయితే బృహస్పతికి, శనిశ్వరుడికి మధ్య స్నేహం సంబంధాలు లేవు. కనుక తులసి మొక్కను ఇంటికి పశ్చిమ దిశలో పెంచకూడదు. అంతేకాదు ఇంటికి పశ్చిమ దిశ వైపు ఖాళీగా గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి. అలాగే శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పశ్చిమ దిశలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనె దీపం వెలిగించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు