Phalguna Amavasya: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. పాల్గుణ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..
తెలుగు సంవత్సరంలో చివరి రోజు పాల్గుణ మాసం అమావాస్య. ఈ ఏడాది మార్చి 29 వ తేదీన వచ్చింది. అదే రోజున ఈ 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది. అమావాస్య తిథిని పితృ దేవతలకు అంకితం చేసిన తిథిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. మీరు పిత్ర దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..

ప్రతి నెల కృష్ణ పక్ష చివరి రోజున అమావాస్య తిధి. తెలుగు నెలలో చివరి మాసం పాల్గుణ మాసం కొనసాగుతోంది. ఏడాదిలో చివరి రోజు చివరి అమావాస్య 29 మార్చి 2025న వచ్చింది. ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఏర్పనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక సూతక కాలం చెల్లదు.
అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. ఈ తిథికి అధిపతులు కూడా పూర్వీకులే. ఈ కారణంగా సూర్యగ్రహణం కారణంగా పాల్గుణ అమావాస్య రోజున చేసే ఎటువంటి మతపరమైన ఆచారాలను ఆపాల్సిన పని లేదు. అమావాస్య రోజున, పవిత్ర నదులలో స్నానం చేయడం, తర్పణం ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం ముఖ్యమైనవిగా భావిస్తారు. దీని వలన పూర్వీకులు సంతోషిస్తారని, వారు తమ ఆశీర్వాదాలను ఇస్తారని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో పాల్గుణ అమావాస్య తిధి రోజున తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక చర్యలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా, పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు.
మీ పూర్వీకులను ఎలా సంతోషపెట్టాలి?
పాల్గుణ అమావాస్య రోజున ఉదయమే పవిత్ర నదిలో స్నానం చేసి.. మీ పూర్వీకులను తలచుకుంటూ ప్రార్థనలు చేయండి. అలాగే పూర్వీకుల పేరిట పేదలకు, ఆపన్నులకు ఆహారం అందించండి. మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. జాతకంలోని పితృ దోషం కూడా తొలగిపోతుంది.
కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది
ఈ అమావాస్య నాడు రావి చెట్టుకు నీరు, పాలు సమర్పించి, బియ్యం, పండ్లు, పువ్వులు, నల్ల నువ్వులు మొదలైనవి నైవేద్యంగా పెట్టండి. దీని తరువాత రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి, చేతులు జోడించి 11 ప్రదక్షిణలు చేయండి. గోమాతకు ఆహారాన్ని అందించి 11 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేయండి. ఇలా చేయడం వలన పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదంతో, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి.
పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది
పాల్గుణ అమావాస్య రోజున ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో నీరు, నల్ల నువ్వులు, దర్భలను కలిపి పూర్వీకులను ధ్యానించండి. దీని తరువాత పూర్వీకుల పేరిట దానం చేయండి. ఇలా చేయడం పూర్వీకుల ఆత్మలకు శాంతిని ఇస్తుందని, పితృ దోషం నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించడం కోసం
పాల్గుణ అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరి నుంచి ఒక రూపాయి నాణెం తీసుకొని ఆ డబ్బులను ఆలయానికి విరాళంగా ఇవ్వండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేయయండి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని.. వృత్తి, వ్యాపారంలో పురోగతి ఉంటుందని నమ్ముతారు.
ఏ విధంగా మీరు మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందుతారంటే.
పాల్గుణ అమావాస్య రోజున ఆవు పేడతో చేసిన పిడకల మీద కాల్చి.. దానిపై పాలతో చేసిన పాయసాన్ని తయారు చేసి పూర్వీకులను ధ్యానించి నైవేద్యంగా సమర్పించండి. పూజ చేసిన తర్వాత కాకికి, కుక్కకు ఆ ఆహారాన్ని అందించండి. ఆవుకి పచ్చి గడ్డిని తినిపించండి. ఈ పరిహారాలను చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు