Chanakya Niti: ఈ లక్షణాలున్న వ్యక్తులు చదువుకున్న మూర్ఖులు.. వీరితో స్నేహం పాముతో స్నేహం వంటిదే…
ఇది కలియుగం.. మనిషిలోనే మంచి చెడు గుణాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ముఖానికి మేకప్ వేసుకున్నట్లు.. కొంతమంది మనసుకి కూడా మేకప్ వేసుకుంటారు. పైకి ఒకలా ఉంటూ.. మనసులోపల ఒకళా ఆలోచిస్తూ జీవించేవారు నేటి కాలంలో మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. దీంతో ఎవరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. అందువల్ల మనుషులతో స్నేహం చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదు. కొన్ని లక్షణాలున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వీరు ముర్ఖులని చెబుతున్నాడు.

ఉన్నత చదువులు చదివినంత మాత్రాన, ఉన్నత పదవులు చేపట్టి చాలా డబ్బు సంపాదించినంత మాత్రానా జ్ఞాని కాలేడు. సమాజంలో కీర్తింపబడడు. మాటతో, పనులతో నడకతో నడతతో మాత్రమే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చదువుకున్నా కొంతమంది ఎప్పుడూ తెలివితక్కువ పనులు చేస్తారు. ఈ కారణంగా ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ మూర్ఖులుగా పది మందితో గుర్తింపబడతారు. ఎవరైనా ఈ ఐదు లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వారిని మూర్ఖులుగా భావించి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఈ లక్షణాలున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు.
తమను తాము తెలివైనవారిగా భావించే వ్యక్తులు: కొంతమంది తాము తాము తెలివైనవారుగా భావిస్తారు. అయితే వాస్తవంగా వీరు అతి తెలివితక్కువ వ్యక్తులు. వీరు ఇతరులు చెప్పే మంచి మాటలను లేదా సూచనలను వినడానికి సిద్ధంగా ఉండరు. కనుక ఇలాంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సలహా తీసుకోవద్దు. అంతేకాదు ఇలాంటి వ్యక్తులకు ఏదైనా విషయంలో మంచి సలహా ఇవ్వడానికి ప్రయత్నించినా.. వారిని అవమానించడానికి కూడా వెనుకాడరు. కనుక ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇతరులను అవమానించే వ్యక్తులు: చిన్న విషయాలకు కూడా తమ చుట్టూ ఉన్న వారిని వ్యంగ్యంగా మాట్లాడుతూ పదే పదే అవమానించే వ్యక్తులు నిజంగా తెలివితక్కువవారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం మాత్రంమే కాదు. మాట్లాడం కూడా మంచిది కాదు. వీరి వలన అవమానం జరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి గుణం వ్యక్తులకు ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియదు. కనుక మీ చుట్టూ ఇలా వ్యంగ్యంగా మాట్లాడే లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటే.. వారికి దూరంగా ఉండటం ఉత్తమం అని చాణక్యుడు చెప్పాడు.
స్వయం ప్రకటిత మేధావులు: వీరు అందరి ముందు తమని తామే పోగుడుకుంటూ ఉంటారు. ఇలాంటి నేచర్ ఉన్న వ్యక్తులు మూర్ఖులు అని చాణుక్యుడు చెప్పాడు. వీరు ఇతరుల గురించి పాజిటివ్ గా మాట్లాడరు.. ఇతరులను పొరపాటున కూడా ప్రశంసించారు. వీరు ఎప్పుడూ తాము సరైనవారమని అనుకుంటారు. ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలను వినడానికి ఇష్టపడరు. వీరికి ఓపిక కూడా ఉండదు.
ఆలోచించకుండా పనులు చేసే వ్యక్తులు: కొంతమంది తాము ఏమి చేస్తున్నాం.. ఇలా చేయడం వలన నష్టాలు, కష్టాలు వస్తాయా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. విచక్షణారహితంగా పనిచేసే ఈ వ్యక్తులు నిజంగా తెలివితక్కువవారు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో వీరు ఇబ్బందులో పడడమే కాదు.. తమతో ఉన్నవారిని కూడా ఇబ్బంది పాలు చేస్తారు. కనుక ఇటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం సరైనది కాదు. ఒకవేళ వీరితో స్నేహం చేస్తే.. నష్టాల పాలు కావాల్సి ఉంటుంది.
అనవసరమైన సలహా ఇచ్చే వ్యక్తులు: కొంత మంది తమ స్నేహితులకు లేదా తన చుట్టు పక్కల ఉన్నవారిని చూసి వెంటనే తమ తెలివి తేటలను ప్రదర్శించాలనుకుంటారు. తమకు తోచిన ఉచిత సలహా ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు తమ తెలివితేటలను ప్రదర్శించడానికి అనుసరించే మార్గం బిన్నంగా ఉంటుంది. వీరికి తెలివి తేటలు తక్కువ. ఎ విషయంపై అవగాహన ఉండదు. అందుకని ఆచార్య చాణక్యుడు సలహా ఇవ్వడం ఇలాంటి లక్షణం ఉన్న వ్యక్తులకు.. తము గొప్ప తెలివిగల వ్యక్తులం అని భావించే వారికీ వీలైంత దూరంగా ఉండాలని సూచించాడు ఆచార్య చాణక్య.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు