AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ 3 రాశుల యువతులు బంగారం.. అందం కంటే మనసుకే ప్రాధ్యానత ఇస్తారు.. ఏయే రాశులంటే

ప్రేమ అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అదే విధంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కూడా మనిషి మనిషికీ ఆలోచనల్లో తేడాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి గురించి విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. కొంతమంది అమ్మాయిలు అందం, డబ్బులు ఉన్న యువకుడిని భర్తగా కోరుకుంటే.. మరికొందరు అందం ఆస్థికంటే మానసిక సౌందర్యాన్ని ఇష్టపడతారు. మంచి తనం మానవత్వం ఉన్న యువకులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇచ్చి భాగస్వామిని ఎంచుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Astro Tips: ఈ 3 రాశుల యువతులు బంగారం.. అందం కంటే మనసుకే ప్రాధ్యానత ఇస్తారు.. ఏయే రాశులంటే
Astro Tips In Telugu
Surya Kala
|

Updated on: Mar 17, 2025 | 8:31 AM

Share

ప్రేమకు కావలసింది శారీరక సౌందర్యం కాదు, మానసిక సౌందర్యం. వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. బాహ్య రూపాన్ని బట్టి నిండు నూరేళ్ళు భార్యాభర్తలుగా జీవించాలనుకోవడం అవివేకమని చెప్పబడినప్పటికీ, కొంతమంది ఇప్పటికీ అలాగే ఆలోచిస్తున్నారు. అయితే ఈ మూడు రాశులకు చెందిన యువతుల ఆలోచనలు అందరికంటే భిన్నం. వీరు బాహ్య సౌందర్యాన్ని బట్టి జీవిత భాగస్వామిని ఎప్పుడూ ఎంచుకోరు. వీరు తాము ప్రేమించే వ్యక్తుల ఆత్మసౌందర్యాన్ని మాత్రమే చూస్తారు. ఈ 3 రాశుల వారు బాహ్య సౌందర్యం ఆధారంగా తమ భాగస్వామిని ఎప్పటికీ ఎంచుకోరు. ఆ మూడు రాశులు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం..

మీన రాశి:

మీన రాశి వారు కరుణ స్వభావం కలిగి ఉంటారు. స్నేహం సానుభూతికి ప్రసిద్ధి చెందారు. మీన రాశికి చెందిన యువతుల దృష్టిలో ప్రేమ అంటే బాహ్య రూపంతో కాదు మానసికంగా ఏర్పడే బంధం. అందుకనే మీన రాశిలో పుట్టిన యువతులు తమ జీవిత భాగస్వామిని అతని కలలు, ఇష్టా ఇష్టాలు, మనస్సును చూసి ప్రేమలో పడతారు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు బాహ్య రూపాన్ని బట్టి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోరు. వృశ్చిక రాశికి చెందిన యువతులకు ప్రతి విషయంపై బలమైన అంతర్ దృష్టి ఉంటుంది. మనుషుల మనసుని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వీరు నిజమైన అందం వ్యక్తి మనసులో ఉంటుందని నమ్ముతారు. తమ జీవిత భాగస్వామిని ఎంతో నిజాయితీగా, భావోద్వేగంగా ప్రేమిస్తారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు నిజాయితీకి విలువ ఇస్తారు. సంబంధాలలో నిజాయతీని, లోతైన సంబంధాన్ని కోరుకుంటారు. కర్కాటక రాశి వారు నిజమైన, ప్రేమగల, శ్రద్ధగల భాగస్వామి కోసం చూస్తారు. అంటే వీరు తమ భావాలను గౌరవించే వ్యక్తిని ప్రేమిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..