AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Vakri In Meen Rashi: మీన రాశిలో తిరోగమనంలో బుధుడు.. ఈ 3 రాశులు బంగారం పట్టుకున్నా మన్నే.. ఖర్చులు, నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే..

బుధుడు గ్రహాలకు రాకుమారుడు. దీని తాత్కాలిక స్థితి జ్యోతిషశాస్త్రంలోని 12 రాశులను ప్రభావితం చేస్తుంది. బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు లభిస్తే.. అతను అశుభంగా ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు బుధుడు బృహస్పతి అధినేత అయిన రాశి మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. బుధుడు తిరోగమనంలోకి మారడం కొన్ని రాశుల వారికి మంచిది కాదు. ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Budh Vakri In Meen Rashi: మీన రాశిలో తిరోగమనంలో బుధుడు.. ఈ 3 రాశులు బంగారం పట్టుకున్నా మన్నే.. ఖర్చులు, నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే..
Budh Vakri In Meen Rashi
Surya Kala
|

Updated on: Mar 17, 2025 | 6:59 AM

Share

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాలకు రాకుమారుడు అంటారు. జ్యోతిషశాస్త్రంలో తెలివితేటలు, వాక్కు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారం మొదలైన అంశాలకు అధిపతి అని చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహం ప్రత్యక్ష, తిరోగమన కదలికలు రెండూ చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. బుధుడు బృహస్పతి రాశి అయిన మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇప్పటికే మీనరాశిలో బుధుడు తిరోగమనాన్ని మొదలు పెట్టాడు.

ఏ రాశుల వారికి సమస్యలంటే

బుధ గ్రహం తిరోగమన గమనం మొత్తం 12 రాశుల వారిపైనా ప్రభావం చూపుతుంది. అయితే బుధ గ్రహం తిరోగమన గమనం కొన్ని రాశుల వారి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ప్రతి రంగంలోనూ ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

మేషరాశి

రాశుల్లో మొదటి రాశి మేష రాశి. ఈ రాశి అధిపతి కుజుడు. మేష రాశి 12వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది నష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. 12వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల మేష రాశి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మేష రాశి వారు తమ ఆదాయాన్ని తెలివిగా ఖర్చు చేయాలి. దాచుకున్న డబ్బులను ఖర్చు చేసే ముందు నూటికి పదిసార్లు ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఆర్ధికంగా చెడు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.

కన్య రాశి

కన్య రాశి రాశుల్లో ఆరవ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహం బుధుడు. బుధుడు కన్య రాశిలోని ఏడవ ఇంట్లో తిరోగమనం చెందాడు. జాతకంలో ఏడవ ఇల్లు జీవిత భాగస్వామిది. ఇప్పుడు బుధుడు తిరోగమనంలోకి మారడంతో ఈ రాశికి చెందిన వివాహితులకు తమ జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశుల్లో తొమ్మిదవ రాశి. ఈ రాశికి అధిపతి దేవ గురువు బృహస్పతి. ధనుస్సు రాశి నాల్గవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. జాతకంలో ఈ స్థానం ఇల్లు, భూమి, వాహనం, తల్లికి సంబంధించినది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఇల్లు, భూమి, వాహనాల నుంచి ప్రయోజనాలను కోరుకుంటే, కష్టపడి పనిచేయండి. తల్లి నుంచి తగిన మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తులు ఏ పని చేసినా చాలా ఓపికగా చేయాలి. చెడు సహవాసంకు దూరంగా ఉండండి. లేకుంటే ఆర్ధికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..