AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivling at home: ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలంటే కొన్ని నియమాలున్నాయి.. పాటించకపోతే ఎంత నష్టమో తెలుసా

సృష్టి లయకారుడు శివుడు.. ఆయనకు ప్రతి రూపంగా శివలింగాన్ని పుజిస్తారు. దేశంలో అనేక ఆలయాలున్నాయి. అయితే ఇంట్లోని పూజ గదిలో మాత్రం శివలింగాన్ని పూజించరు. ఇలా శివలింగానికి ఇంట్లో ఎందుకు పూజ చేయరు. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయ. శివుడిని శక్తికి మూలంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలా వద్దా అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం.

Shivling at home: ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలంటే కొన్ని నియమాలున్నాయి.. పాటించకపోతే ఎంత నష్టమో తెలుసా
Shiva Lingam At Home
Surya Kala
|

Updated on: Mar 15, 2025 | 10:56 AM

Share

మహాదేవుడికి ప్రతి రూపంగా శివలింగాన్ని పూజిస్తారు. ఈ శివలింగానికి చాలా శక్తి ఉంది. శివుడిని శక్తికి మూలంగా భావిస్తారు. దేవతలు, రాక్షసులు కూడా శివుని శివలింగ శక్తిని తట్టుకోలేకపోయారు. మరి అలాంటిది మనం సాధారణ మనుషులం..మరి శివ శక్తిని తట్టుకోగాలమా.. అసలు ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

శివలింగం శక్తితో నిండి ఉంటుంది. ఇది చాలా శక్తిని విడుదల చేస్తుంది. అలాగే శక్తికి మూలం. ఈ కారణంగా కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించకూడదని నమ్ముతారు. శివలింగం నుంచి చాలా శక్తి వెలువడుతుందని.. దాని కారణంగా ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు విశ్వసిస్తారు. మానసిక ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు. శారీరక సమస్యలు మిమ్మల్ని చుట్టముట్టవచ్చు. ఆ ఇంట్లో నివసించే వారికీ కోపం రావచ్చు.

శివలింగం శక్తి జ్వాల వంటిది. శివలింగం నుంచి వెలువడే శక్తిని చల్ల బరిచేందుకు ప్రతిరోజూ శివలింగానికి నీరుని సమర్పిస్తారు. చందనం తో కప్పి ఉంచుతారు. ఇలా చేయడం దేవాలయాలలో మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించవచ్చని నమ్ముతున్నప్పటికీ.. కొన్ని నియమాలను పాటించాలి. లేకుంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

  1. మీరు మీ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుంటే.. ఆ శివ లింగం బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
  2. ఇంట్లో పాదరసంతో చేసిన శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ఇది చాలా శుభప్రదం. శివలింగంతో పాటు, గణేశుడు, పార్వతి దేవి, కార్తికేయుడు నంది విగ్రహాలను కూడా పెట్టుకోవాలి.
  3. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ప్రతిష్టించవద్దు.
  4. ఎవరైనా శివలింగాన్ని లోహ రూపంలో ప్రతిష్టించాలనుకుంటే.. అది బంగారం, వెండి లేదా రాగితో తయారు చేసింది అయి ఉండాలి. అలాగే శివలింగం చుట్టూ పాము చుట్టుకుని ఉండేలా చూసుకోవాలి.
  5. శివలింగాన్ని ప్రతిష్టించే సమయంలో ఆ శివ లింగాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్టించకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఇంటి మూలలో శివలింగాన్ని ఎప్పుడూ ప్రతిష్టించవద్దు.
  6. శివలింగం ఎల్లప్పుడూ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. కనుక శివలింగంపై నీరు ప్రవహిస్తూనే ఉండేలా జాగ్రత్త వహించండి. ఇది శక్తిని ప్రశాంతంగా ఉంచుతుంది.
  7. శివలింగాన్ని ప్రతిష్టించవద్దు. శివలింగానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి.
  8. ప్రతిరోజూ శివలింగం దగ్గర దీపం వెలిగించండి.
  9. ప్రతిష్టించిన శివలింగం స్థానాన్ని మార్చకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయాల్సి వస్తే ముందుగా శివలింగం మీద గంగా జలంతో అభిషేకం చేసి పచ్చి పాలుని సమర్పించాలి. అప్పుడు ఆ శివ లింగం స్థానాన్ని మార్చండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు