AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Herbal Tea: బెల్లీ ప్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా.. రాత్రి హెర్బల్ టీని ఇలా తాగండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

హెర్బల్ టీ ఆరోగ్యానికి మంచివే.. అయితే రాత్రి సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల జీవక్రియ సక్రియం కావడమే కాదు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. అనేక హెర్బల్ టీలు ఉదర ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. శరీరం లోపల పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపడంలో సహాయపడతాయి. అంతేకాదు బరువు తగ్గడంలో ముఖ్యపాత్రని పోషిస్తాయి.

Herbal Tea: బెల్లీ ప్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా.. రాత్రి హెర్బల్ టీని ఇలా తాగండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Herbal Teas For Weight LossImage Credit source: pexel
Surya Kala
|

Updated on: Mar 15, 2025 | 10:32 AM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వ్యాయామంతో పాటు తినే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పెరిగిన వారు జిమ్‌లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తారు. అయితే ప్రతి రాత్రి హెర్బల్ టీ తాగడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా రాత్రి నిద్రపోయే ముందు హెర్బల్ టీ తాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది.

హెర్బల్ టీలను వివిధ రకాల మొక్కలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల నుండి తయారు చేస్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు శరీరంలోని కొవ్వును కాల్చే ప్రక్రియను సక్రియం చేస్తాయి. రాత్రి సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. నిద్ర మెరుగుపడుతుంది. అంతేకాదు బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని సరైన రీతిలో త్రాగడం ముఖ్యం.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే అంశాలు జీవక్రియను పెంచడంలో, కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఈ టీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి దానికి నిమ్మ రసం లేదా తేనె కలపండి. ఈ గ్రీన్ టీని రాత్రి భోజనం చేసిన అర గంట లేదా ఒక గంట తర్వాత త్రాగాలి.

పుదీనా టీ

పుదీనా టీ శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ టీ జీవక్రియను పెంచుతుంది. ఇది బొడ్డు దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది. పుదీనా టీ తాగడం వల్ల కడుపులో భారంగా.. ఉబ్బరంగా ఉండదు.

తాజా పుదీనా ఆకులను మరిగించి టీ తయారు చేసుకోవాలి. పడుకునే ముందు తాగండి

చామంతి టీ

చమోమిలే టీ లేదా చామంతి టీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. తగినంత నిద్ర శరీర జీవక్రియను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఈ హెర్బల్ టీ కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను సక్రియం చేస్తుంది.

ఒక కప్పు నీటిలో చమోమిలే పువ్వులను వేసి నీటిని మరిగించండి. ఈ హెర్బల్ టీని నిద్ర పోయే సమయానికి 30-40 నిమిషాల ముందు త్రాగాలి.

హెర్బల్ టీ తాగడంతో పాటు, తప్పని సరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా సరైన సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ హెర్బల్ టీ ని తాగవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)