AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాచలంలో వైభవంగా తలంబ్రాల వేడుక.. రామయ్య పెళ్లి పనుల్లో పరవశించిన భక్తులు..

భద్రాద్రి లోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్‌ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు

భద్రాచలంలో వైభవంగా తలంబ్రాల వేడుక.. రామయ్య పెళ్లి పనుల్లో పరవశించిన భక్తులు..
Kalyana Talambram
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2025 | 11:36 AM

Share

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే రామయ్య పెండ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆగమశాస్త్రం ప్రకారం జగత్కల్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రి లోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయ రాఘవన్‌ నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తాము ఎంతో భక్తితో గోటితో ఒలిచిన బియ్యాన్ని శిరస్సు పై ధరించి, గిరిప్రదక్షిణ గావించి తలంబ్రాలలో కలిపారు. చాలా మంది భక్తులు హోలీ పూర్ణిమ నాడు రామయ్యను పెండ్లి కుమారునిగా చేస్తారాని భావిస్తారు.

స్వామివారి తలంబ్రాల తయారీ కోసం తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం గులాల్‌ కలిపారు. కుంకుమ, పసుపు, సెంటు, రోజ్‌ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను జోడిస్తారు. బేడా మండపం వద్ద స్వామివారికి అభిషేక మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి డోలోత్సవం చేశారు. పలువురు భక్తులు గోటి తలంబ్రాలను అందించారు. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ స్కీమ్